Home

»

Bollywood News

‘నీ పక్కన హీరోయిన్‌గా ఎవ‌రూ న‌టించ‌రు..’ అమితాబ్‌కు ఎదురైన అవ‌మానాలు ఇవే.!

Oct 6, 2026 7:12PM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న ఆయన.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈ స్థాయికి చేరుకునే ముందు కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నానని బిగ్ బీ తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ కార్యక్రమంలో తన ప్రారంభ రోజుల గురించి మాట్లాడుతూ.. తన ఎత్తు, ముఖాకృతి కారణంగా నిర్మాతలు తనను విమర్శించేవారని తెలిపారు.

సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నిర్మాతలు తనతో రెండు విషయాలు చెప్పేవారని అమితాబ్ వెల్లడించారు. తాను చాలా పొడవుగా ఉండటంతో తన సరసన నటించేందుకు ఏ హీరోయిన్‌ ముందుకు రాదని ఒక కారణం చెప్పేవారట. అంతేకాదు, తన ముఖం శరీరంతో పోలిస్తే చాలా చిన్నగా కనిపిస్తుందని కూడా విమర్శించేవారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తనను ఎంతగానో ఆలోచింపజేశాయని అమితాబ్ చెప్పారు. ముఖం కొంచెం నిండుగా కనిపించేలా చేయడానికి ఒక మార్గంగా జుట్టును పెంచడం ప్రారంభించానని, కణతల వరకు జుట్టు పెంచుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత అదే హెయిర్‌స్టైల్ అమితాబ్ బచ్చన్‌ ప్రత్యేక గుర్తింపుగా మారిపోయింది. 1970లలో ఆయన పొడవాటి జుట్టు, సైడ్‌బర్న్స్‌తో కనిపించిన లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘జంజీర్’తో 1973లో ఆయన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగిన తర్వాత.. ‘దీవార్’, ‘షోలే’, ‘డాన్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ వంటి చిత్రాలతో ఆయన స్టార్‌డమ్ మరింత పెరిగింది. ఒకప్పుడు తనకు మైనస్‌గా చెప్పిన ఎత్తు, రూపం, హెయిర్‌స్టైల్‌నే తర్వాత ఆయన స్క్రీన్ ఇమేజ్‌లో కీలకమైన భాగాలుగా మారాయి.

ఇలా తనలోని లోపాలుగా ఇతరులు చూసిన అంశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకుని అమితాబ్ భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా ఆయన ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్ 1970లలో ఒక ట్రెండ్‌గా మారింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన విమర్శలే చివరకు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయని చెప్పేలా బిగ్ బీ తాజాగా పంచుకున్న ఈ జ్ఞాపకాలు నిలిచాయి.

 

 

[Amitabh Bachchan, Amitabh Bachchan Struggles, Amitabh Bachchan Height, Amitabh Bachchan Hairstyle, Big B, Kaun Banega Crorepati 18, Amitabh Bachchan Career, Amitabh Bachchan Early Days, Zanjeer, Bollywood News, Amitabh Bachchan Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com