
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ యాక్షన్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న 'YRF స్పై యూనివర్స్' (YRF Spy Universe) నుంచి ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), యంగ్ సెన్సేషన్ శార్వరి వాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పై థ్రిల్లర్ మూవీ 'ఆల్ఫా' (Alpha) టీజర్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర అఫీషియల్ టీజర్‌ను జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో సినీ ప్రియులు, ముఖ్యంగా అలియా భట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన స్పై సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సరికొత్త పంథాలో సాగనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అలియా భట్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ అవతారంలో కనిపించబోతోంది. ఇప్పటివరకు వచ్చిన స్పై యూనివర్స్ సినిమాల్లో హీరోలు దేశాన్ని రక్షించే ఏజెంట్లుగా కనిపిస్తే, ఈ సినిమాలో అలియా భట్ ఒక 'ఆల్ఫా కిల్లర్' (Alpha Killer) పాత్రలో నరమేధం సృష్టించబోతోందని టాక్. చిన్నతనం నుంచే కేవలం చంపడమే లక్ష్యంగా శిక్షణ పొందిన ఒక ప్రొఫెషనల్ అస్సాసిన్ పాత్ర చుట్టూ ఈ కథ తిరగనుంది.
'ఆల్ఫా' సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ డిస్నీ 'మోనా' (Moana) విడుదల ఉండటంతో.. 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ని ఒక వారం ముందుకి అంటే జూలై 3 కి జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.
శివ్ రావల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో అలియా భట్, శార్వరి వాగ్‌లతో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే వర్సటైల్ యాక్టర్ బాబీ డియోల్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా, అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ 'కబీర్' పాత్రలో ఒక అదిరిపోయే క్యామియో అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.




