
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్చల్ చేస్తోంది. అమీర్ ఖాన్ ఇప్పుడు తన మూడో పెళ్లికి సిద్ధమయ్యారంటూ జాతీయ మీడియా వర్గాల్లో ఒక ఆసక్తికరమైన కథనం బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం అమీర్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్(Gauri Spratt)తో ఈ ఏడాది జూలై 5న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో వైవాహిక బంధాన్ని ముగించుకున్న అమీర్ ఖాన్.. 61 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త వినగానే అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
జూలై 5న జరగబోయే ఈ వివాహ వేడుకను అత్యంత నిరాడంబరంగా, కేవలం అత్యంత ఆప్తులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు అమీర్ ఖాన్ కానీ, ఆయన టీమ్ కానీ ఈ పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ లీక్డ్ రిపోర్ట్ మాత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ను పూర్తిగా షేక్ చేస్తోంది.
ఏది ఏమైనప్పటికీ అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట ఒక హాట్ టాపిక్‌గా నిలిచిపోయింది. మరి ఈ క్రేజీ బాలీవుడ్ వెడ్డింగ్ అప్‌డేట్‌పై అమీర్ ఖాన్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.





