English | Telugu

జీ మహోత్సవం.. స్పెషల్ అట్రాక్షన్ గా శ్రీలీల, లావణ్య త్రిపాఠి!

అన్ని చానెల్స్ తో పాటు జీ కూడా సరిసమానంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇకపోతే త్వరలో 18 వ జీ మహోత్సవం 2023 కార్యక్రమాన్ని రూపొందించారు. త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ ప్రోగ్రాం. "అంగరంగ వైభవంగా, తారల మధ్య ఘనంగా జరిగిన జీ తెలుగు మహోత్సవం సంబరాలు త్వరలో మన జీ తెలుగులో" అంటూ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది.

ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జీ తెలుగు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంబరాన్నంటబోతున్నాయి. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నారు. "జీ టీవీ వ్యూయర్స్ అందరికీ కంగ్రాట్యులేషన్స్" అని చెప్పాడు నవీన్ పోలిశెట్టి. "హ్యాపీ బర్త్ డే జీ..కంగ్రాట్యులేషన్స్" అని చెప్పింది నటి శ్రీలీల. "దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ గివింగ్ మీ అమేజింగ్ ఫామిలీ" అంది లావణ్య త్రిపాఠి. ఇలా ఈ షోలో ఆటలు, పాటలు, గేమ్స్, అవార్డ్స్ అన్ని రకాల సెగ్మెంట్స్ ని చూపించారు.

2005 లో ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ కేవలం సీరియల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ షోలో బుల్లితెర సీరియల్స్ లో నటీనటులంతా హాజరయ్యారు. అలాగే సెలబ్రిటీస్ చేతుల మీదగా అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఇక ఇందులో ఆది, కోన వెంకట్, మాళవిక నాయర్, నందిరెడ్డి, మధుప్రియ, సాకేత్ కొమండూరి, సుహాసిని, కౌశల్, మధుసూదన్, హరిత, జాకీ ఇలా అందరూ ఈ షోలో కనిపించబోతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.