English | Telugu
డెంగీతో బాధపడుతున్న ఆరియానా...జాగ్రత్తగా ఉండండి!
Updated : May 8, 2023
రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఆరియానా గ్లోరీ ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది. ఈ ఇంటర్వ్యూ ముందు వరకు ఆరియానా ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనతో ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అయ్యేసరికి వెలుగులోకి వచ్చింది ఆరియానా. ఆ పాపులారిటీ ఆమెకు బిగ్ బాస్ సీజన్ 4 లోకి వెళ్లగలిగింది. అలా ఆమె ఫైనల్ వరకు వెళ్లడమే కాదు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమెకు మంచి మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. బుల్లితెర మీద షోస్ చేస్తోంది..బీబీ కేఫ్ ని నడిపింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన డైలీ అప్ డేట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఆరియానా ఇప్పుడు డెంగీ బారిన పడి ఇంట్లో రెస్ట్ తీసుకుంటోంది. దీనికి సంబంధించి ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. " నాకు జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ఎదుర్కోవడం అంతగా రాదు.. అంత ఈజీ కూడా కాదు..ఒంట్లో నలతగా ఉండేసరికి చెక్ చేయించుకుంటే నాకు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా..ప్రస్తుతానికి ఇంకా కోలుకుంటున్నాను...దయచేసి మిమ్మల్ని, మీ వాళ్ళను ఈ దోమ కాటు నుంచి చాలా జాగ్రత్తగా ఉంచండి, కాపాడుకోండి. నా క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా చెప్తున్నా..అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ" అంటూ ఒక చేతిలో గ్లాస్ ని మరో చేతికి కేనోల పెట్టుకుని కూర్చున్న పిక్ ని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న గీతామాధురి "గెట్ వెల్ సూన్" అని మెసేజ్ పెట్టింది. ఇక ఆరియానా ఫాన్స్, నెటిజన్స్ అంతా కూడా "బొప్పాయి జ్యూస్ తాగండి, జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి, భయపడకండి ఆయుర్వేదం వాడండి" అంటూ రకరకాలుగా ఆమెను మోటివేట్ చేస్తూ మెసేజెస్ పెట్టారు.