English | Telugu

ఎంక్వయిరీలో మర్డర్‌ మిస్టరీ బయటపడనుందా?

స్టార్‌ మాలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘గుప్పెడంత మనసు’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -924లో.. మహేంద్ర కోసం అనుపమ కాలేజీకి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్లని మహేంద్ర గురించి అడుగగా.. మహేంద్ర సర్‌ జగతి మేడం చనిపోయినప్పటి నుండి కాలేజీకి రావడం లేదని వాళ్ళు చెప్పగానే.. అసలు జగతి ఎలా చనిపోయిందని అనుపమ వాళ్లని అడుగుతుంది. మాకు తెలియదని వాళ్ళు చెప్తారు.

మరొకవైపు అప్పుడే వచ్చిన శైలేంద్ర.. అనుపమని చూసి వాళ్ళు మాట్లాడుకునేది వింటాడు. అనుపమని ఫోటో తీసి దేవయానికి పంపిస్తాడు. ఆ తర్వాత దేవయానికి శైలేంద్ర ఫోన్‌ చేసి.. అనుపమ ఇక్కడికి వచ్చింది. ఫోటో పంపించాను చూడమని చెప్తాడు. అనుపమ ఫోటో చూసి దేవయాని షాక్‌ అవుతుంది. జగతి ఎలా చనిపోయిందంటూ ఎంక్వయిరీ మొదలుపెట్టింది. రిషి వసులతో మాట్లాడడానికి వచ్చిందని శైలేంద్ర అనగానే.. నువ్వు అనుపమని వెంటనే మన ఇంటికి తీసుకొని రా. అనుపమ ఇప్పుడు రిషి వసుధారలని కలిస్తే అంత తెలిసిపోతుందని దేవయాని కంగారుపడుతుంది. ఆ తర్వాత శైలేంద్ర లోపలకి వెళ్లి ఎవరో తెలియనట్టు అనుపమతో మాట్లాడుతాడు.. కావాలనే తన ముందు దేవయానికి ఫోన్‌ చేస్తాడు. ఆ తర్వాత అనుపమని ఇంటికి రమ్మని దేవయాని రిక్వెస్ట్‌ చేస్తుంది. వెళ్తే జగతి గురించి నిజాలు తెలుస్తాయి కదా అని శైలేంద్రతో పాటు అనుపమ దేవయాని దగ్గరికి వెళ్తుంటే.. అప్పుడే రిషి, వసుధారలు ఎదురుగా వస్తుంటారు. శైలేంద్ర వాళ్లని చూసి.. అనుపమని వాళ్ళిద్దరు చూడకుండా జాగ్రత్తపడతాడు.

ఆ తర్వాత అనుపమ దేవయాని దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. జగతిని చాలా బాగా చూసుకున్నానంటూ తనకి పాజిటివ్‌ గా చెప్పుకుంటూ మహేంద్రని అనుపమ దృష్టిలో నెగెటివ్‌ చెయ్యాలని ప్రయత్నం చేస్తుంది. అసలు జగతి ఎలా చనిపోయిందని అనుపమ అడగగానే.. ఎవరో రౌడీ షూట్‌ చేసాడు. అయిన ఎండీ చైర్‌ లో కూర్చొని ఉన్నప్పుటి నుండి ఇలా జగతిపై ఎటాక్‌ లు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎండీ చైర్‌ గురించి జగతి, వసుధారలకి ఆర్గుమెంట్‌లు జరిగేవి. ఆ గొడవలు చూడలేక రిషి వెళ్ళిపోయాడంటూ వసుధార గురించి నెగెటివ్‌ ఇంప్రెషన్‌ రావాలని అనుపమకి దేవయాని చెప్తుంది. మరి మీరు ఎప్పుడు ఎండీ చైర్‌ గురించి ఆశ పడలేదా అని అనుపమ అనగానే.. శైలేంద్ర, దేవయాని ఇద్దరు షాక్‌ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.