English | Telugu

మహేంద్రకి చక్రపాణి నిజం చెప్పనున్నాడా!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -672 లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో... రిషీతో దేవయాని మాట్లాడి వెళ్ళిపోతుంది.

రిషి మళ్ళీ కాలేజీకి వస్తున్నాడు సంతోషంగా ఉందని జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటారు. అక్కడే ఉన్న ధరణి "పెద్ద అత్తయ్య గారు వెళ్లి వచ్చాక రిషిలో మార్పు వచ్చింది" అని అంటుంది. అది విని ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసిందని మహేంద్ర అంటాడు. "ఎప్పుడూ రిషి, వసుధారలు విడిపోవాలని అనుకుంటుంది. అంతా ఆవిడ అనుకున్నట్టే జరిగింది" అని దేవయాని గురించి జగతి అంటుంది. ఇంతలోనే పెద్ద అత్తయ్య గారు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే సంతోషంగా ఉంటుంది అని ధరణి అనగా, నాక్కూడా అలాగే అనిపిస్తుంది అని మహేంద్ర అంటాడు.

ఇంతలోనే మహేంద్ర ఇంటికి చక్రపాణి వస్తాడు. జరిగిందంతా చెప్పడానికి వస్తాడు. దాంతో ఎందుకు వచ్చావ్ అని మహేంద్ర కోపంగా అంటాడు. చక్రపాణి అన్న మాటలు గుర్తు చేస్తుంది జగతి. "నన్ను ఆ రోజు అన్ని మాటలు అన్నారు.. దయచేసి వెళ్ళండి.. మీలాగా మాట్లాడలేం.. మాకు సభ్యత సంస్కారం ఉన్నాయి" అని అంటుంది.

అప్పుడే వసుధార వచ్చి చక్రపాణిని చెప్పకుండా ఆపుతుంది. "వసుధార గారు... మీరు వెళ్ళండి ఇక్కడి నుండి వెళ్ళండి. మీకు నమస్కారం చేస్తున్న వెళ్ళండి" అని జగతి అంటుంది. చక్రపాణి, వసుధారలను అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.