English | Telugu

జంతు బలులు జరుగుతున్నాయని తెలిస్తే సమాచారం ఇవ్వండి!

రష్మీ గౌతమ్.. బుల్లితెర మీద ప్రస్తుతం ఏలుతున్న యాంకర్స్ లో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. కామెడీ షోకి యాంకర్ గా చేస్తూనే టాలీవుడ్ లో చిన్న మూవీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ చేసింది అమ్మడు. అలా స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి ప్రమోట్ ఐన యాంకర్స్ లో రష్మీ గౌతమ్ కూడా ఒకరు.

రష్మీ యాంకర్ మాత్రమే కాదు జంతు ప్రేమికురాలు కూడా. వాటి కోసం సోషల్ మీడియాలో ఫుల్ ఫైట్ చేస్తూ ఉంటుంది. మూగ జీవాలను ఎవరైనా బాధ పెట్టినా, హింసించినా.. చిన్నా పెద్దా అని కూడా చూడకుండా ఏకిపారేసి ఉతికారేస్తుంది. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, త్రిపుర, కేరళ ప్రాంతాల్లో జంతు బలులకు సంబంధించి ఎవరికైనా ఖచ్చితమైన సమాచారం ఉంటే గనక వెంటనే దానికి సంబంధించిన మొత్తం సమాచారంతో సహా అలాగే ఏవైనా ఫోటోలు ఉంటే వాటిని కూడా జత చేసి ఎక్కడ జరిగిందో ఆ లొకేషన్ తో సహా ఈ కింది అడ్రస్ కి మెయిల్ చేయండి" అంటూ రష్మీ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది.

రష్మీగౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. జబర్దస్త్ వేదిక మీద సుడిగాలి సుధీర్ - రష్మీ రీల్ పెయిర్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. ఐతే ప్రస్తుతం వీళ్ళు వేరువేరుగా షోస్ చేసుకుంటున్నా కూడా ఏదో ఒక సందర్భంలో వీళ్ళను టార్గెట్ చేసి కామెడీ బిట్స్ చేస్తూనే ఉంటారు కమెడియన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.