English | Telugu

Vishnupriya Buzz: తల్లి ప్రమాణంగా నేను అలా చెప్పలేదు: విష్ణుప్రియ!

Vishnupriya Buzz: తల్లి ప్రమాణంగా నేను అలా చెప్పలేదు: విష్ణుప్రియ!

 

బిగ్ బాస్ సీజన్-8 లో శనివారం నాటి ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేషన్ అయ్యింది. ఇక సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేషన్ తర్వాత బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది విష్ణుప్రియ.

పద్నాలుగు వారాలు హౌస్ లో ఏం చేశావని యాంకర్ అడుగగా.. డైమండ్స్ ఆర్ మేడ్ ఇన్ ప్రెజర్ అన్నారంటూ విష్ణుప్రియ అంది. వహ్.. ఈ కొటేషన్ ఆటో వెనకాల రాస్కోమని యాంకర్ అన్నాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమేంటి? అందరు తెలుసుకోవాలనుకుంటున్నారని యాంకర్ అడుగగా.. కొంచెం ఇన్ ఫాక్చువేషన్.. కొంచెం క్రష్ అని విష్ణుప్రియ అంది. క్రష్ అంటే అని యాంకర్ అనగా.‌ క్రష్ చేద్దామని అనుకున్నానంటూ విష్ణుప్రియ అంది. పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు.. ' పృథ్వీని కన్నందుకు థాంక్స్' అని చెప్పావ్ కానీ ఆమె నిన్ను కూతురులాగా చూసిందని యాంకర్ అనగా.. పెళ్ళి తర్వాత ఎవరైనా కూతురులాగే చూసుకుంటారు కదా అని విష్ణుప్రియ అంది. 

ఏదన్న ఒక్క టాస్క్ చెప్పు బెస్ట్ ఇచ్చానని యాంకర్ అనగా‌‌.. బస్తాల టాస్క్ ఆడాను కదా అని విష్ణుప్రియ అంది. అందరు కలిసి ఆడిన ఆట గురించి కాదు.. నువ్వు ఆడింది చెప్పమని యాంకర్ అనగా.. బిత్తెరపోయింది విష్ణుప్రియ. బజ్ లోకి వచ్చిన సీత, హరితేజ మాకొక మాట చెప్పారని యాంకర్ అనగా.. తల్లి ప్రమాణంగా నేను అలా అనలేదంటూ విష్ణుప్రియ అంది. అసలు ఆ మాటేంటి? విష్ణుప్రియ గురించి సీత, హరితేజ చెప్పిన విషయమేంటో తెలియాలంటే బజ్ ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.