English | Telugu
నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క మహారాణి మా అమ్మ
Updated : Feb 15, 2023
యాంకర్ విష్ణుప్రియ ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా హంగామా చేయడం లేదు. వాళ్ళ అమ్మ దూరమైన దగ్గర నుంచి విష్ణుప్రియ కొంచెం డౌన్ ఐనట్టు కనిపిస్తోంది. వాలెంటైన్స్ డే తర్వాతి రోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "అమ్మ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..నువ్వు నాకు పంచిన ప్రేమను, ఇచ్చిన బలాన్ని ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేరు. ఐ లవ్ యూ అమ్మ.. మిస్ యూ ఫరెవర్ ...నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క మహారాణి మా అమ్మ " అంటూ విష్ణు తాను గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటల్ని, తల్లితో గడిపిన స్వీట్ మొమెంట్స్ ని , అల్లరిని యాడ్ చేసి ఒక వీడియో అప్ లోడ్ చేసింది. లాస్ట్ మంత్ అనారోగ్యంతో విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు.
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. విష్ణుప్రియ ఒక యూట్యూబర్‌గా జర్నీ స్టార్ట్ చేసి 'పోవే పోరా' షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా.. బుల్లితెర నటిగానూ అలరిస్తోంది. ఇటీవల విడుదలైన "వాంటెట్ పండుగాడు" మూవీలోనూ నటించింది విష్ణుప్రియ. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తోంది. విష్ణుప్రియ పెట్టిన పోస్ట్ కి రీతూ చౌదరి, అష్షు బాధపడుతూ ఎమోజీస్ పెట్టారు.