English | Telugu

శోభనం గుర్తొచ్చింది కానీ తాళిబొట్టు గుర్తురాలేదా!

"సుమ అడ్డా షో" నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోయింది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో విష్ణుప్రియ- ధనరాజ్, వేణు-చంద్ర వచ్చారు. ఇలా స్టేజి మీద వచ్చారో లేదో "మీ అందరికీ బెస్ట్ టాపిక్...మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి" అనే టాస్క్ ఇచ్చింది. "ఇది మంచి టాపిక్ ఎలా అవుతుంది ...ఇంటికెళ్ళాక సాడ్ టాపిక్ అవుతుంది కానీ" అన్నారు వేణు, ధనరాజ్. తర్వాత విష్ణుప్రియ, ధనరాజ్ తో గేమ్ ఆడించింది సుమ. "పెళ్లి అనగానే మీకేం గుర్తొస్తాయి" అనేసరికి "షాపింగ్, బంధుమిత్రులు, శుభలేఖలు, కల్యాణ మండపం, బంగారం, " అని ధనరాజ్ చెప్పేసరికి "శోభనం" అని విష్ణుప్రియ చెప్పింది.

"శోభనం గుర్తొచ్చింది కానీ తాళిబొట్టు గుర్తురాలేదా మీకు" అని వాళ్ళ మీద కౌంటర్ క్వశ్చన్ వేసాడు వేణు. "భార్యను ఇలాంటప్పుడు భర్తను పట్టించుకోదు" అని సుమ అడిగేసరికి "బట్టలు కొనేటప్పుడు" అని చెప్పింది విష్ణుప్రియ. తర్వాత "నువ్ అమ్మీ అమీ"అనే సాంగ్ కి డాన్స్ చేశారు చేశారు ధనరాజ్, విష్ణుప్రియ. ఆ డాన్స్ కి ధనరాజ్ కి నడుము పట్టేసరికి "పెళ్ళైన రెండు రోజులకే" అని ఏడ్చింది విష్ణు. తర్వాత పురాణ పాత్రలను చూపించి గెస్ చేయాలి అనే టాస్క్ ఇచ్చింది. అందులో రెండు టీమ్స్ పోటీ పడ్డాయి. అభిమన్యుడు, కర్ణుడికి మధ్య తేడా తెలియక ధనరాజ్ కి, వేణుకి మధ్య చిన్న యుద్ధం జరిగింది. ఆ తర్వాత విష్ణుప్రియ, చమ్మక్ చంద్ర ఇద్దరూ కలిసి చంద్రముఖి మూవీలోని సాంగ్ కి డాన్స్ చేశారు. ఇలా నెక్స్ట్ వీక్ ఈ షో మంచి కామెడీని అందించబోతోంది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.