English | Telugu

కాఫీ లవర్స్ అండి..మరీ రోజుకు ఒక్క కప్పేనా


వీణా శ్రీవాణి-వేణు స్వామి జోడి ఇన్స్టాగ్రామ్ లో దుమ్ము రేపుతూ ఉంటారు. శ్రీవాణి వీణని అద్భుతంగా వాయిస్తూ ఉంటుంది. అలాగే క్లాసెస్ కూడా చెప్తూ ఉంటుంది. వేణు స్వామి జ్యోతిష్యం కూడా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. అలాంటి వీణా శ్రీవాణి రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అదేంటంటే చేతిలో ఒక అతి భారీ కాఫీ కప్ ని పట్టుకుని కనిపిస్తుంది తర్వాత "డాక్టర్స్ చెప్పారు రోజుకు ఒక కప్పు కాఫీ మాత్రమే అని" అంటూ కాప్షన్ పెట్టింది. అంటే అంత భారీ కప్పులో కాఫీ తాగితేనే తగినట్టు ఉంటుంది అని చెప్తున్నగా ఉంది ఈ వీడియో. ఇక నెటిజన్స్ ఐతే "మేము కూడా కాఫీ లవర్స్ , వీణ మీద హనుమాన్ చాలీసా ప్లే చేయరా" అని అంటున్నారు. లవ్ స్టోరీ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘సారంగదరియా..’ను తన వీణతో అద్భుతంగా వాయించిన శ్రీవాణి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అప్పటి నుంచి ఆమె జనాలకు ఇంకా బాగా తెలిసింది. వేణుస్వామి, శ్రీవాణిది ప్రేమ వివాహం. శ్రీవాణి ఒకప్పుడు కొన్ని ఛానెల్స్ లో యాంకర్ గా కూడా పని చేసింది. 2012లో బెస్ట్ యాంకర్ అవార్డును గెలుచుకుంది. 1998లో వీణలో రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచింది. అలాగే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన డోరేమాన్ కార్టూన్ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. మాములుగా ఐతే వీణ స్పీడ్ 120 ఉంటుంది. ఇది వాయించడమే చాలా కష్టం. అలాంటిది వీణను 130 స్పీడ్ లో వాయిస్తుంది శ్రీవాణి. వీణ వాయించడం అంటే శ్రీవాణికి ఎంత ప్రేమో అర్ధమవుతోంది. .ఆమె మూడో తరగతిలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా బండారులంకలో పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర వీణలో ఓనమాలు నేర్చుకున్నారు. ఇక ఇప్పుడు ప్రతీ మూవీలోని ట్రెండ్ అయ్యే సాంగ్ ని శ్రీవాణి తన వీణ ద్వారా వాయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.