English | Telugu

తాళి ఎవరు కట్టారని వసుధారని నిలదీసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -683 లోకి అడుగు పెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. వసుధార మినిస్టర్ గారి దగ్గర.. "నా హస్బెండ్ ఆల్ రౌండర్" అని చెప్తుంది. ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అదృష్టవంతుడెవరో చూడాలని ఉందమ్మా అని మినిస్టర్ అంటాడు. రిషి సర్ కూడా ఇలానే అన్నాడని వసుధార అనడంతో.. రిషికి కోపం వచ్చి ఏంటి ఇంత సరదాగా ఉత్సాహంగా మాట్లాడుతుంది. బాగా పొగరని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇద్దరు బయలుదేరుతారు.

జగతి, మహేంద్రలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారో లేదో ఎవరు ఫోన్ చెయ్యట్లేదని రిషి, వసుధారల గురించి అనుకుంటారు. రిషి, వసుధారలు కార్ లో వెళ్తుండగా.. మినిస్టర్ గారు ఇచ్చిన చీరని తన మీద వేసుకొని సెల్ఫీలు తీసుకుంటుంది వసుధార. అది చూసిన రిషికి కోపమొస్తుంది. రిషి సర్ నవ్వండంటూ రిషితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తుంటుంది. "సర్ మీ మొహంపై నవ్వు మిస్ అయ్యింది" అని వసుధార అనడంతో.. కార్ బ్రేక్ వేసి కార్ లో నుండి కోపంగా దిగుతాడు. "ఏంటి నువ్వు అస్సలు.. ఎందుకు వచ్చావ్ నా లైఫ్ లోకి.. నేను ఐ లవ్ యు చెప్పాను నువ్వు నో చెప్పావ్.. మళ్ళీ కొన్ని రోజులకి నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావ్.. సరేనని ఒప్పుకున్నాను. నువ్వు మీ ఊరు వెళ్ళి మారిపోయావ్.. నేను ప్రేమించినప్పుడు నో చెప్పి అలాగే ఉండిపోతే బాగుండేది.. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకొచ్చావ్? వాడెవడో వచ్చి నీ మెడలో తాళి కట్టానని అంటాడు. మళ్ళీ ఇంకెవడో వచ్చి తాళి కట్టలేదు అంటాడు. అసలు నీ మెడలో తాళి కట్టింది ఎవడు? నాకు ఇప్పుడు నిజం చెప్పు" అని రిషి ఆవేశంతో అనడంతో.. "సర్ నా మెడలో తాళి కట్టిన వ్యక్తి గురించి మర్యాదగా మాట్లాడండి" అంటూ వసుధార కోపంగా చెప్తుంది. "ఎందుకు ఇలా చేస్తున్నావ్.. నా జీవితాన్ని నాశనం చేస్తున్నావ్.. ఇన్ని రంగులు ఎందుకు మార్చుతున్నావ్.. ఇదంతా నీ ప్లానా" అని రిషి అనడంతో.. ఒక్కసారి వసుధార గుండె ముక్కలవుతుంది. ఏంటి సర్.. ఏం మాట్లాడుతున్నారు. నేను రంగులు మార్చుతున్నానా? ఇదంతా నా ప్లానా అంటూ ఎమోషనల్ అవుతుంది. మీరు కూల్ గా అడిగితే నిజం చెప్పేదాన్నేమో కానీ నేను ఇప్పుడు చెప్పను. నా గురించి ఇన్ని తెలుసుకున్న మీరు.. నా మెడలో తాళి ఎవరు కట్టారో కూడా తెలుసుకోండని అక్కడ నుండి వెళ్లిపోతుంటుంది. అలా వెళ్లేముందు వెన్నక్కి తిరిగి.. "ఒక్క మాట సర్.. నా మెడలో తాళి కట్టింది ఎవడో అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు కదా.. ఆ విషయం నా మెడలో తాళి పడటానికి కారణం అయ్యిన వ్యక్తికి తెలిస్తే ఊరుకోడు" అని ఛాలెంజ్ విసిరి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది వసుధార. తను వెళ్ళిపోయాక.. అనవసరంగా తొందరపడ్డానా అని రిషి అనుకుంటాడు.

జగతి, మహేంద్రలు ఆలోచిస్తూ రిషి, వసుధారలు ఊహకైనా అందరు.. ఇద్దరికి ఇగో టన్నుల్లో ఉంటుందని మాట్లాడుకుంటారు. ఎవరు కూడా తగ్గరని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.