English | Telugu

వసుధారను ప్రేమగా హత్తుకున్న రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -689 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో.. వసుధార రూమ్ లోని ఒక పేపర్ మీద "ఐ లవ్ యు మై MD సర్ " అని రాసి ఉంటుంది. అది రిషి చూసి ఎమోషనలవుతాడు. ఆ తర్వాత వసుధార దగ్గరకి బయల్దేరతాడు.

మరోవైపు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిషి సర్ నిజం తెలుసుకోవడం లేదని, నాకు నేనుగా చెప్పాలంటే భయంగా ఉందంటూ గుడికెళ్ళి అమ్మవారి ముందు నిల్చొని బాధపడుతుంది. ఇంకా ఎన్నాళ్ళమ్మ ఈ ఆవేదన.. కన్నీళ్లు.. ఎలాగైనా రిషి సర్ ని మీరే మార్చాలంటూ వసుధార ఏడుస్తుంది. అప్పటికే వసుధార వెనకాలకి రిషి వచ్చేస్తాడు. వసుధార అని ప్రేమగా పిలిచి హత్తుకుంటాడు రిషి. "మీరు వస్తారని నాకు తెలుసు సర్" అని చెప్తూ ఆనందపడుతుంది. అప్పుడే వసుధార మెడలోని తాళి, రిషి షర్ట్ బటన్ కి అతుక్కుపోతుంది. ఈ‌ సీన్ అంతా ఎమోషనల్ గా సాగుతూ.. హైలైట్ అఫ్ ది ఎపిసోడ్ గా మారింది. రిషి తన మనసులో ఉన్న బాధనంతా వసుధారకి చెప్తాడు. ఈ ఒక్క నిజం తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందా అని వసుధార అడుగగా.. ఎందుకు ఇలా చేసావని రిషి బాధతో అంటాడు. సర్ నేను కావాలనేం దాచలేదని, రాజీవ్ తనని బెదిరించిన విషయం దగ్గరి నుండి అన్ని విషయాలు చెప్తుంది. "నీకు నువ్వు తాళి మెడలో వేసుకోవడమేంటి" అని రిషి అడుగగా.. సర్ అది జగతి మేడం నాకు పంపించారు. మీకు తెలియకుండానే అది మీరే తీసుకొచ్చి ఇచ్చారు.. అది మీరే నా మెడలో కట్టినట్లు నమ్ముతున్నానని వసుధార చెప్తుంది. అయినా ఇన్ని రోజులు కాలేజీలో అందరూ అలా మాట్లాడుకున్నారు. అందరు నా వైపు ప్రశ్నార్ధకంగా చూస్తుంటే ఏం చెప్పాలో తెలియలేదు అని రిషి చెప్తాడు. అలా మాడ్లాడుకుంటుండగా.. వసుధారకి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. వసుధార ఏమైంది అంటూ ఎత్తుకొని తన కార్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు రిషి.

మరోవైపు దేవయాని హాల్లో కూర్చుని ఉండగా.. ధరణి వచ్చి ఎవరో శుభలేఖ ఇచ్చారని తీసుకొస్తుంది. దేవయాని అక్కడే ఉన్న జగతి,మహేంద్రలకి వినపడేటట్లు మాట్లాడుతుంది. "అన్ని బాగుంటే మనం కూడా ఇలా రిషి పెళ్ళికి శుభలేక ప్రింట్ చేయించేవాళ్ళం" అని దేవయాని అనగానే.. తొందరలోనే మా ఇంట్లో కూడా ఇలా శుభలేక ప్రింట్ అయ్యేలా చేయు దేవుడా.. అందులో మా రిషి పేరు ఉండేలా చేయండి దేవుడా అని మహేంద్ర అంటాడు. మరి రెండవ పేరు ఎవరిది చిన్న మావయ్య అని ధరణి అంటుంది. అంతా దేవుడి ఇష్టమని మహేంద్ర అంటాడు. ఏంటో మీ ప్లాన్స్ అసలు అర్థం కావని దేవయాని అక్కడినుండి వెళ్ళిపోతుంది.

మరోవైపు వసుధారని కార్ లో పడుకోపెట్టి రిషి తీసుకుపోతుంటాడు. ఇంతలో వసుధార మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. వెంటనే కార్ పక్కకి ఆపి హాస్పిటల్ కి వెళ్దామా అని రిషి అడుగుతాడు. అవసరం లేదు టెన్షన్ కి ఇలా అయిందని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.