English | Telugu

రిషి కోసం వసుధార కేరింగ్.. ఇద్దరు దగ్గరయినట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -715 లో.. రిషి క్యాబిన్ కి వసుధార వస్తుంది. "సర్ మీరు నన్ను ఎందుకు పిలిచారో తెలుసు. స్కూటీపై ఎందుకు వచ్చావ్ అనే కదా. మీరు లిఫ్ట్ ఇవ్వలేదు.. అందుకే వచ్చాను సర్. ఏం చెయ్యమంటారు" అని వసుధార అంటుంది. "దాని గురించి ఏం పిలవలేదు. మన కాలేజీకీ వాల్యుయేషన్ స్పాట్ గా అవకాశం ఇస్తున్నామని.. ఇప్పుడే మనకి యూనివర్సిటీ నుండి మెయిల్ వచ్చింది. ఈ విషయం జగతి మేడం, డాడ్ కి చెప్పు. దీనికి సంబంధించిన అన్ని విషయాలు జగతి మేడంని చూసుకోమని చెప్పు" అని వసుధారతో చెప్తాడు. సర్ నాక్కూడా ఏమైనా వర్క్ చెప్పండని వసుధార అడుగగా.. ఇది కాలేజీకి సంబంధించినది.. ప్రాజెక్ట్ ది కాదు.. కావాలంటే జగతి మేడంకి అసిస్టెంట్ గా ఉండమని రిషి అంటాడు. వాటికి కూడా డబ్బులు ఇస్తారా సర్? పెళ్ళి అయింది కదా ఖర్చులు ఉంటాయి సర్ అని వసుధార అడుగుతుంది. సర్లే .. బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తాడు.

ఆ తర్వాత రిషి ల్యాబ్ కి వెళ్తుంటే.. వసుధార వచ్చి.. "ఏంటి సర్.. ఎక్కడికి వెళ్తున్నారు. మీరు ఆ ల్యాబ్ లోకి వెళ్ళకండి. ఇదివరకు ఒక్కసారి అందులో ఫైర్ అయింది. అప్పుడు మీరు ప్రాణాలతో బయటపడ్డారు.. నేను వెళ్లనివ్వను" అని వసుధార అంటుంది. ఇది వరకు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటాడు రిషి.. ఒకసారి అలా అయిందని ప్రతీసారి అదే అవ్వదని రిషి చెప్పినా.. వసుధార వినదు. అంతలో ల్యాబ్ అసిస్టెంట్ వస్తాడు. అతనికి ల్యాబ్ లో అన్నీ కరెక్ట్ ఉన్నాయో? లేవో? నాకు చెప్పు అని వసుధార చెప్పి పంపిస్తుంది. తన కోసం వసుధార కేరింగ్ తీసుకోవడంతో రిషికి నచ్చేస్తుంది.

జగతి, మహేంద్రలు వెళ్తుంటే.. రిషి వచ్చి.. మీరు ఎందుకు బండి మీద వచ్చారు. కార్ ఉంది కదా అని రిషి అనగానే మహేంద్ర తడబడుతూ.. జస్ట్ ఫర్ చేంజ్ అని అంటాడు. సరే జాగ్రత్తగా వెళ్ళండని రిషి చెప్తాడు. రిషి, వసుధార కలిసి ఒకే కార్ లో కాలేజీ నుండి బయల్దేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.