English | Telugu

పూజలో కూర్చోడానికి మనకి ఆ అర్హత ఉందా..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -712 లో.. దేవయాని పూజ పేరుతో ఏం ప్లాన్ చేసిందో అని జగతి మహేంద్రలు ఆలోచిస్తారు. జగతి దగ్గరికి రిషి, వసుధారల బట్టలు తీసుకొని వస్తుంది దేవయాని. "నువ్వు మహేంద్ర ఇద్దరు కలిసి నవ దంపతులు అయిన రిషి, వసుధారలకి ఈ బట్టలు ఇవ్వండి. వాళ్ళిద్దరే ఈ పూజలో కూర్చోవాలి. నువ్వు ఇలాంటివి ఏం పట్టించుకోవు కదా" అని జగతి తో దేవాయని అంటుంది. జగతి ఆ బట్టలు తీసుకొని మహేంద్ర దగ్గరకి వెళ్ళి, పూజ పేరుతో ఏదో ప్లాన్ చేసింది అనుకున్నాం కదా.. ఆ ప్లాన్ ఇదే. వసుధారతో కలిసి పూజలో కూర్చోవడం రిషికి ఇష్టముండదు. అప్పుడు వసుధారని రిషి కోప్పడి, ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాడు.. ఇదే తన ప్లాన్" అని జగతి అంటుంది. మనం ఫస్ట్ అయితే వసుధారకి ఈ బట్టలు ఇచ్చి రిషికి ఇవ్వమందామని తన దగ్గరికి జగతి, మహేంద్ర ఇద్దరు వెళ్తారు.

వాళ్ళిద్దరు తీసుకొచ్చిన ఆ బట్టలు వసుధార చూస్తుంది. "ఈ బట్టలు ఇప్పుడు రిషి సర్ కి ఇచ్చి పూజ మీద మనమే కూర్చోవాలని చెప్తే సర్ ఒప్పుకోడు. ఇప్పటికే సర్ కి నామీద కోపం ఉంది" అని వసుధార అంటుంది. నువ్వు రిషి దగ్గరికి వెళ్ళి ఈ బట్టలు దేవాయని అక్క పంపిందని చెప్పు అని జగతి, మహేంద్రలు అక్కడ నుండి వెళ్ళిపోతారు. రిషి దగ్గరికి వసుధార వెళ్ళగానే అనుకున్నటుగానే రిషి కోప్పడతాడు. మనం నిజమైన భార్య భర్తలమా మనకి ఆ అర్హత ఉందా అని రిషి అంటాడు. "సర్.. దేవయాని మేడం ఇచ్చారు" అని వసుధార అనగానే.. పెద్దమ్మతో నేను చెప్పుకుంటానని రిషి అంటాడు. పూజకి టైం అవుతుంది. ఆ దంపతులను రమ్మనండి అని పంతులు పిలుస్తాడు. రిషి, వసుధార ఇంకా రావట్లేదేంటి, ఇద్దరు గొడవ పడుతున్నట్లు ఉన్నారు.. ఈ వంకతో వసుధారని రిషి బయటకు పంపిస్తాడని దేవయాని మనసులో అనుకుంటుంది.

రిషి, వసుధారలు రెడీ అయి కిందకి వస్తారు. అలా వాళ్ళిద్దరు రావడం చూసి దేవయాని.. "ఏంటి వీళ్ళకి గొడవేం జరగలేదా" అని అనుకుంటుంది. దేవయాని దగ్గరికి వచ్చి.. "పెద్దమ్మ మేం పూజలో కుర్చోవట్లేదు. డాడ్, జగతి మేడం కూర్చుంటారు" అని రిషి చెప్తాడు. లేదు నాన్న మీరు కూర్చోండని దేవయాని అనగానే.. మీతో తర్వాత మాట్లాడుతా పెద్దమ్మ అని రిషి అంటాడు. ఆ తర్వాత పక్కనే ఉన్నవాళ్ళతో.. డాడ్, మేడం మీరిద్దరు కూర్చోండని రిషి అనగానే.. జగతి, మహేంద్రలు కూర్చొని పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.