English | Telugu

లైఫ్ లో నీ ప్రయారిటీ ఏమిటి వైఫా , విండో సీటా

వరుణ్ సందేష్ పేరు వింటే గుర్తొచ్చే సినిమా "కొత్త బంగారు లోకం". అందులో ఎంతో క్యూట్ గా నటించి ఆడియన్స్ మనసుల్ని దోచేశాడు. ఆ వరుణ్ సందేష్ ఇప్పుడు తన వైఫ్ వితిక షేరుతో కలిసి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ "అలా మొదలయ్యింది" కి వచ్చారు. "కొత్త బంగారు లోకం సినిమా టైములో తాను నన్ను ఫస్ట్ టైం చూసిందట" అని వరుణ్ చెప్పేసరికి "మీరు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఉంటారు" అన్నాడు కిషోర్ "కరెక్టే ట్యూషన్ కి వెళ్లి వస్తుంటే" అని వితిక అనేసరికి "ఇక్కడ కుల్ఫీస్ బాగుంటాయని చెప్పి" అన్న కిషోర్ మాటలకు అందరూ నవ్వేశారు.

" నాకు తెలుసు వరుణ్ సందేష్ గారు హీరో అని..చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నా.. ఎందుకంటే బాబు చాల రొమాన్స్ ఎక్కువ చేస్తారని" అని నవ్వేసింది వితిక..."కార్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఫ్లయిట్ ఎక్కినా పడుకుంటాడు" అని వితిక చెప్పేసరికి "నీకు ఫస్టే చెప్పా కదా నాకు విండో సీట్ కంపల్సరీ కావాలని" అన్న వరుణ్ మాటలకూ "లైఫ్ లో నీ ప్రయారిటీ ఏమిటి వైఫ్ ఆ , విండో నా" అన్నాడు కిషోర్. "మరీ ఐదు కంప్లైంట్స్ ఏమిటండి 500 అని పెట్టి ఉంటే టకటక చెప్పేసేదాన్ని" అంది వితిక ఫన్నీగా. డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేష్. తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో మరో హిట్ కొట్టాడు. కానీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ పడ్డాక తనకు వచ్చిన ఆఫర్స్ ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన పెద్దగా హిట్స్ అనేవి ఆయన ఖాతాలో పడలేదు. వితిక షేరుని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వరుణ్. వీళ్ళిద్దరూ కలిసి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.