English | Telugu

'భీమ్లా నాయక్' నటి మౌనిక రెడ్డి పెళ్లిలో వర్షిణి తీన్మార్ డాన్స్!

ఈమధ్య సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళను కూడా బాగా వాడేస్తున్నారు. ఫంక్షన్స్ లో తీన్ మార్ స్టెప్స్ వేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫుల్ పాపులర్ అవుతున్నారు. రీసెంట్ గా నటి ప్రగతి తన సిస్టర్ మ్యారేజ్ లో తీన్మార్ డ్యాన్స్ చేసి పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.

ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే యాంకర్ వర్షిణి తన ఫ్రెండ్ పెళ్లి బరాత్ లో మాస్ బీట్స్ తో తీన్మార్ డ్యాన్స్ చేసింది. ఈమె ఫ్రెండ్ ఎవరో కాదు "భీమ్లా నాయక్" మూవీలో పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ పక్కన నటించిన మౌనిక రెడ్డి.. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేసరికి ఆమెకు లక్ బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఆమెకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సినిమా ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఈమె వివాహం రీసెంట్ గా గోవాలో కూరపాటి సందీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండు రోజుల పాటు గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ని ప్లాన్ చేసుకున్నారు. మౌనిక పెళ్ళికి ఫామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, దగ్గర సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఈ వేడుకకు మౌనిక క్లోజ్ ఫ్రెండ్ వర్షిణి కూడా వెళ్లి రచ్చరచ్చ చేసింది.చీర కట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబై బీచ్ ఒడ్డున మండపంలో సందడి చేసేసరికి తానే పెళ్లి కూతురేమో అన్నంత అందంగా కనిపించింది. అందరూ అలాగే అనుకున్నారు. ఆ ఫోటోలను వర్షిణి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చూసిన వాళ్లంతా నీ పెళ్లి అనుకుంటారు వర్షిణి..నా పెళ్ళని చెప్పు" అని మౌనిక సరదాగా కామెంట్ కూడా చేసింది. మౌనికతో కూడా డ్యాన్స్ చేయించింది వర్షిణి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.