English | Telugu

రష్మీ గురించి సుధీర్ కి ఫోన్ చేసి చెప్పిన వర్ష

రష్మీ గురించి సుధీర్ కి ఫోన్ చేసి చెప్పిన వర్ష

"మిస్టర్ హ్యాండ్సం" కాంటెస్ట్ తో నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ దుమ్ము రేపడానికి రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో అందాల పోటీలు నిర్వహించగా వర్ష క్యాట్ వాక్ చేసింది. "ఆమెనే కళ్ళార్పకుండా చూస్తున్న మరో కమెడియన్ ని ఆటో రాంప్రసాద్ చూసి ఇక్కడేం చేస్తున్నావ్..పక్కకెళ్ళు" అంటూ పంపించేశాడు. తర్వాత మెహబూబ్ వచ్చి లేడీ డాన్సర్స్ తో కలిసి హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఇందులో స్టన్నింగ్ స్టెంట్స్ చేసే వాళ్ళను తీసుకొచ్చారు.  తర్వాత పుల్లప్స్ ఎవరు ఎక్కువగా చేస్తారు అనే విషయం మీద మెహబూబ్ కి, మరో బాడీబిల్డర్ కి  మధ్య పోటీ పెట్టింది. ఇందులో మెహబూబ్ ఎక్కువ పుల్లప్స్ తీసేసరికి అందరూ ఖుషీ ఇపోయారు.

తర్వాత ఒక బాడీ బిల్డర్ కి బులెట్ భాస్కర్ కి మధ్యన హ్యాండ్ రెస్లింగ్ పోటీ పెట్టారు. భాస్కర్ ఓడిపోయేసరికి "పందిలా తినడం కాదు..చూడు బాడీ అంటే అది" అంటూ తిట్టాడు నాటీ నరేష్. వాళ్ళ పోటీ ఐపోయాక రష్మీకి మరో బాడీ బిల్డర్ కి మధ్యన హ్యాండ్ రెస్లింగ్ పోటీ జరిగింది. ఐతే రష్మీ నవ్వుకు ఆ బాడీ బిల్డర్ ఓడిపోయాడు. అది చూసిన వర్ష ఫోన్ చేసి "బావా అంతా ఐపోయింది ..ఏం లేదింకా" అనేసరికి రష్మీ షాకయ్యింది. చాలా రోజుల తరువాత ఇండైరెక్ట్ గా సుధీర్ టాపిక్ ని తీసుకొచ్చినట్టుగా కనిపించింది. తర్వాత బుల్లితెర నటులతో రాంప్ వాక్ చేయించారు. అంబటి అర్జున్, ఆదర్శ్, మెహబూబ్, శ్రీకర్ కృష్ణ, బులెట్ భాస్కర్, రాంప్రసాద్ ఇలా అందరూ లేడీస్ తో కలిసి చేసిన పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్సెస్ తో ఈ రాబోయే వారం షో అదరగొట్టబోతోంది.