English | Telugu

సిక్స్త్ సెన్స్ లో ఓంకార్ డైరెక్ట్ చేసిన "మాన్షన్ 24 " ఫస్ట్ లుక్ రిలీజ్


సిక్స్త్ సెన్స్ షోకి ఈ వారం వరలక్ష్మి శరత్ కుమార్, బిందు మాధవి వచ్చారు. వీళ్ళతో సీరియస్ గా గేమ్స్ ఆడిస్తూనే మధ్యలో "మాన్షన్ 24 " వెబ్ సిరీస్ కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఓంకార్. త్వరలో టీజర్, ట్రైలర్ కూడా వచ్చేస్తుంది. ఇంకో నెలన్నరలో హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ వచ్చేస్తుంది అని చెప్పారు. "వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యింది కదా మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏమిటి.. ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలో మీ మాటల్లో చెప్పండి" అంటూ వరుని, బిందుని అడిగారు ఓంకార్.

"ఈరోజున అందరూ కంటెంట్ మాత్రమే చూస్తున్నారు. థ్రిల్లర్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హారర్ ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి. చెప్పిన విధానం చాలా బాగుంది..ఆ మేకింగ్, టేకింగ్ చూస్తే మేమే షాకయ్యాం...ఇందులో 6 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. హారర్ ఫ్లిక్స్ ఇష్టపడే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ చేసేటప్పుడే చాలా భయమేసింది..నిజంగా స్క్రీన్ మీద చూసే వాళ్లకు ఆ ఎక్స్పీరియన్స్ మాములుగా ఉండదు" అని చెప్పారు.

"మీరు ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా హాట్ స్టార్ కి ఈ టోటల్ వర్కింగ్ డేస్ లో మీకు నచ్చిన ఒక మూవ్మెంట్ ఏమిటి" అని వరలక్ష్మిని ఓంకార్ అడిగారు. "సత్యరాజ్ గారితో చేసిన సీన్స్ చాలా బాగున్నాయి." అని చెప్పింది. "ఈ వెబ్ సిరీస్ లో ప్రతీ ఒక్కరూ పోటీ పడి మరి చేశారు..వరూ ఇంత బాగా చేసిందా..నేను కూడా బాగా చేయాలి అంటూ తులసి గారు నటించారు... ఇలా పోటాపోటీగా చేశారు అని చెప్పారు ఓంకార్. "మీకు నచ్చిన షాట్ కానీ సీక్వెన్స్ కానీ చెప్పండి" అని బిందుని అడగడంతో "నా స్టోరీలో నందు ఉన్నారు..ఆయనతో చేసిన షాట్స్ నాకు చాలా నచ్చాయి. అని చెప్పింది. "నాకు తెలిసి నందు తన కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ చేసి ఉండరు" అని చెప్పారు ఓంకార్. ఫైనల్ ఈ టీమ్ మొత్తం చెప్పింది ఏంటంటే ఈ "మాన్షన్ 24 " హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెన్సేషన్ సృష్టించబోతోంది అని...

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.