English | Telugu

‘కార్తీకదీపం’ని చాలా మిస్ అవుతున్నానని చెప్పిన వంటలక్క!

కార్తీకదీపం సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారమై ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. కార్తీకదీపం సీరియల్ లో దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ ని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పేరు వంటలక్క. ఈ సీరియల్ లో దీప క్యారెక్టర్ సామాన్య మహిళలకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఫ్యామిలీ అంతా మెచ్చే సీరియల్ గా ఎక్కువ కాలం కొనసాగింది. మిగతా సీరియల్స్ తో పోల్చితే ఈ సీరియల్ ఎన్ని సంవత్సరాలైనా క్రేజ్ తగ్గకుండా మొదటి నుండి టాప్ రేటింగ్ తో దూసుకువెళ్ళింది.

కార్తీకదీపం సీరియల్ లో దీప, కార్తీక్ కొన్నిరోజులు విడివిడిగా దూరంగా ఉన్నారు. అయితే ఇక కలిసిపోయారు అనే టైం లో మోనిత కొత్త సమస్యలు తెస్తుంది. వాటిని సాల్వ్ చేసే పనిలో వంటలక్క ఉంటుంది. ఇక అంతా ఓకే అని శుభం కార్డ్ కూడా వేసేసారు కార్తీక దీపం సీరియల్ మేకర్స్. అయితే మంచి క్లైమాక్స్ తో శుభమ్ కార్డు వేస్తారని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసారు. కానీ మోనితలో ఎలాంటి మార్పు లేకపోవడం, తనేమైందనే ప్రశ్నలకు జవాబివ్వకుండా సరైన ముగింపు లేకుండానే పూర్తి చేశాడు డైరెక్టర్.

మళ్ళీ కలుద్దామంటూ ముగిసిన కార్తీక దీపంకు సీక్వెల్ ఉంటుందని చెప్పిన డైరెక్టర్.. ఇప్పటి వరకు కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. కార్తీక దీపం సీరియల్ యాక్టర్స్ అందరూ వారి వారి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటున్నారు. వంటలక్క తన ఓన్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా రిలీజైన కస్టడీ మూవీలో సపోర్ట్ రోల్ చేసిన ప్రేమీ విశ్వనాథ్ ని స్క్రీన్ మీద చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

కార్తీక దీపం పూర్తవడం వల్ల ప్రేక్షకులకు దూరమయ్యానని తను అనుకుంది కాబోలు అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కన్పిస్తుంది. తను చేసే ప్రతి పనిని ఫ్యాన్స్ కి చేరవేస్తుంది వంటలక్క. తాజాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి కూల్ గా సమాధానం చెప్పింది దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. కార్తీక దీపం సీరియల్ గురించి ఒక్క మాటలో చెప్పండని అడుగగా... బెస్ట్ సీరియల్ ఆల్వేజ్ లవ్ ది సీరియల్. మిస్సింగ్ అంటూ చేసింది వంటలక్క. ఇలా కార్తీక దీపం సీరియల్ తర్వాత తను ఒంటరిగా ఫీల్ అవుతుంది.. అందుకే ఇలా కొత్త కొత్త ఫోటలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది ప్రేమీ విశ్వనాథ్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.