English | Telugu

ఒరేయ్ అన్నయ్య అంటే మా అమ్మ కొడుతోంది


సిక్స్త్ సెన్స్ సీజన్ 6 ఈ వారం షో రెండు వెబ్ సిరీస్ మధ్య కామెడీగా, ఫన్నీగా, పోటాపోటీగా జరిగింది. ఇందులో "డెడ్ పిక్సెల్స్ నుంచి రోనాక్, నిహారిక, అక్షయ్ వచ్చారు, సేవ్ ది టైగర్స్ నుంచి అభినవ్, మహి వి గౌతమ్, పావని వచ్చారు. ఈ రెండు వెబ్ సిరీస్ మంచి కలెక్షన్స్ తో, టాప్ రేటింగ్స్ తో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్నాయి. అలాంటి ఈ రెండు వెబ్ సిరీస్ యాక్టర్స్ మధ్య ఈ వారం షో నడిచింది. ఫస్ట్ రౌండ్ లో నిహారికకు ఓంకార్ ఒక క్వశ్చన్ వేసాడు "ఇంట్లో వరుణ్ తేజ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు" అని అడిగాడు. "అంటే మా అన్నయ్యకు చాల ముద్దొస్తే తల్లి అంటాడు అప్పుడు నేను ఏం కావాలన్నా అని అడగాలి..తల్లీ అంటే ఏదో ఒకటి ఎదుగుతాడని అర్ధం కొంతమంది అన్నయ్యని ఒరేయ్ అన్నయ్య అంటారు కదా అలా పిలిస్తే మా అమ్మ నన్ను కొట్టిద్ది" అని చెప్పింది.

సెకండ్ రౌండ్ లో నిహారికకు కొన్ని పజిల్ క్వశ్చన్స్ వేసాడు ఓంకార్ "అన్ని వెజిటల్ కలిసి బార్ కి గనక వెళ్తే ఆ బార్ పేరేంటి" అని అడిగేసరికి "సాంబార్" అని చెప్పింది " ఒక క్లాస్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు..వాళ్ళ ముందు టీచర్స్ ఎందుకు సన్ గ్లాసెస్ వేసుకున్నారు" అని అడిగాడు "ఎందుకంటే స్టూడెంట్స్ చాల బ్రైట్ కాబట్టి" అని చెప్పింది నిహారిక. ఇలా ఈ షోలో రెండు టీమ్స్ పోటీ పడగా "సేవ్ ది టైగర్స్" టీం గెలిచింది. "మా షోలో ఎలాంటి ఐతే టెన్షన్ పడుతూ ఆడతామో అలాంటి టెన్షన్ మళ్ళీ మీ గేమ్ షోలో కనిపించింది. గన్నులు, బాంబులు ఇలాంటివి చాలా ఉన్నాయి" అని చెప్పింది నిహారిక. నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ మూవీ ద్వారా 2016లో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఆమె తన జర్నీ మొదలుపెట్టి రీసెంట్ గా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్" వంటి వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించి సక్సెస్ ని అందుకుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.