English | Telugu
ఆ అయిదుగురు వాళ్ళేనా?
Updated : Nov 16, 2022
బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటివరకు ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తూ కనువిందు చేస్తోంది. అయితే ఈ సీజన్ చివరి దశకు చేరుకుందా? ఒకవేళ చేరుకుంటే టాప్ ఫై లో ఉండే అవకాశం ఎవరికి ఉంది? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఇప్పటివరకు సగం కంటే ఎక్కువ భాగం పూర్తయిన ఈ సీజన్. అన్ని సీజన్స్ కంటే ఎక్కువ మంది కంటెస్టెంట్స్ తో మొదలైన సంగతి తెలిసిందే.
ప్రతీవారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుండగా, ఒక్కో వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం హౌస్ లో పది మంది హౌస్ మేట్స్ ఉన్నారు. అందులో 'రేవంత్, రోహిత్, మెరీనా, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి భట్, ఇనయా, ఫైమా, శ్రీసత్య, రాజ్' ఉండగా వీరిలో టాప్ ఫై లో ఎవరు ఉంటారు? అని ఆసక్తి అందరిలోను ఉంది. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ వేసే ప్రేక్షకులు ఈ అంచనాలను తారుమారు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఓటింగ్ లో ఒక్క రేవంత్ తప్ప మిగతా వారందరికి నిలకడ లేదు. రేవంత్ మాత్రం మొదటి వారం నుండి ఇప్పటి వరకు ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంటూ వస్తున్నాడు.
అయితే రెండవ స్థానం కోసం శ్రీహాన్ కి ఇనయా గట్టి పోటీని ఇస్తోంది. కారణం గత వారం టాస్క్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. తనని హౌస్ అంతా టార్గెట్ చేసినా తను ఎక్కడ కూడా తగ్గలేదు. అందుకు గాను ఇనయా గతవారం ఓటింగ్ లో రెండవ స్థానంలో ఉంది. కాగా మూడవ స్థానంలో శ్రీహాన్ ఉన్నాడు. అయితే మిగతా రెండు స్థానాల కోసం హౌస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ఎందుకంటే అందరు వారి వారి ఆటతీరును, మాటతీరును మారుస్తూ, పర్ఫామెన్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానాలలో ఎవరు? అనేది కన్ఫ్యూజన్ గా మిగిలి ఉంది. కాగా ఆదిరెడ్డి మరియు రోహిత్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పర్ఫామెన్స్ పరంగా ఇద్దరు బెస్ట్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఇంకో నాలుగు వారాల్లో ఈ కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడుతుందో? లేదో చూడాలి.