English | Telugu

'ది కశ్మీర్ ఫైల్స్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే...

గత కొన్ని వారాల్లో రాధే శ్యామ్, కిన్నెరసాని, పెళ్లి సందడి, కేజిఎఫ్: చాప్టర్ 2 వంటి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో వినోదాన్ని పంచిన 'జీ తెలుగు', ఈ సారి 'ది కశ్మీర్ ఫైల్స్' అనే మరో పాన్-ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రబోర్తి, పల్లవి జోషి, పునీత్ ఇస్సర్, దర్శన్ జోషి, మ్రిణాల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఆగష్టు 28న (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది.

ఈ చిత్రంలోని నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. 1990 లలో కశ్మీరీ పండితులు ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారంగా తీసుకొని నిర్మించబడిన ఈ చిత్రం కశ్మీరీ పండితుడు పుష్కర్ నాథ్ (అనుపమ్ ఖేర్) మనవడైన కృష్ణ పండిట్ (దర్శన్ కుమార్) చుట్టూ తిరుగుతుంది. కశ్మీరీ పండితుల యొక్క నిర్గమనం (ఎక్సోడస్) పై సందిగ్ధంలో ఉన్న కృష్ణ పండిట్, తన తాత యొక్క చివరి కోరికను తీర్చడానికి కశ్మీర్ కు వెళ్తాడు. అక్కడ కృష్ణ పండిట్ పుష్కర్ నాథ్ యొక్క మిత్రుల ద్వారా కశ్మీర్ నిర్గమనం గురించి మరియు తన తల్లితండ్రులు ఎలా చనిపోయారో తెలుసుకోవడంతో కథ అడ్డం తిరుగుతుంది. కశ్మీరీ పండితుల పాత్రలలో నటీనటులు చేసిన అద్భుత ప్రదర్శనలు, మంచి బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ అందరిని టీవీలకు కట్టిపడేస్తాయి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.