English | Telugu
నా వల్ల కాదు బాబోయ్ ఇన్ని పేజీల డైలాగ్స్ చెప్పడం
Updated : Nov 13, 2024
ఈ మధ్య సెలబ్రిటీస్ లో కొంతమంది మాత్రం డైలాగ్స్ చెప్పడానికి తడబడుతూ ఉండడం ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నవ్వడమే లేదా సైలెంట్ గా ఉండడంతో చేసి అక్కడితో మమ అనిపించేస్తున్నారు. బుల్లితెర మీద అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం కమెడియన్ ఉన్నారు. ఆయనే తాగుబోతు రమేష్. ఐతే ఆయన ఈ మధ్య బుల్లితెర మీద చేసే స్కిట్స్ లో కొన్ని డైలాగ్స్ మర్చిపోతూ ఆ మర్చిపోవడాన్ని కూడా కవర్ చేసేలా ఫన్ క్రియేట్ చేస్తున్నారు.
ఇప్పుడు రాంప్రసాద్ ఇదే టాపిక్ మీద తాగుబోతు రమేష్ ని హైలైట్ చేశారు. ఎందులో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో. ఇక ఈ ఎపిసోడ్ కార్తీక పౌర్ణమి కాన్సెప్ట్ తో తీసుకొచ్చింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే రాంప్రసాద్ బావగా తాగుబోతు రమేష్ చేసాడు. "మా బావ సత్యం పండగకు ఊరు నుంచి వచ్చాడు. చిన్నప్పుడు సినిమాల్లో నటించేవాడు. మూడు పేజీలు డైలాగ్స్ ఇచ్చినా చెప్పేసేవాడు" అనేసరికి "ఎం చెప్పేవాడు" అంటూ నూకరాజు అడిగాడు "నా వల్ల కాదని"చెప్పేసేవాడు అని రాంప్రసాద్ ఆన్సర్ ఇచ్చేసరికి తాగుబోతు రమేష్ పరువంతా పోయింది. ఏదేమైనా ఇక మీదట రాంప్రసాద్ అన్నందుకైనా తాగుబోతు రమేష్ డైలాగ్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని చెప్పి ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేయాలని మనమంతా కోరుకుందాం.