English | Telugu

విజయ్ కార్తీక్‌తో నా పెళ్లి.. కానీ వాడు నన్ను మోసం చేశాడు

బుల్లితెర మీద కీర్తి భట్ బాగా ఫేమస్. సీరియల్ నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఐతే ఒక చిట్ చాట్ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "నేను మానేయాలి అనుకుంటే వ్లాగ్స్ చేయడం మానేస్తా. వ్లాగ్స్ తిప్పలు నా వల్ల కాదు. షోస్, సీరియల్స్ మాకు జీవితాన్ని ఇస్తుంది కాబట్టి అవి చేస్తాను. ఇక నా పెట్ నేమ్ చిన్నప్పుడు పుట్టి ఇప్పుడు పాపు. నా ఫ్రెండ్స్ ని విజయ్ కార్తీక్ తన ఫామిలీలాగే చూస్తాడు. ఇక బాడ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా బాత్ రూమ్ లో ఉంటాడు లేదంటే టీవీలో మునిగిపోతాడు. ఇక నా సెలబ్రిటీ క్రష్ వచ్చి యష్. విజయ్ కార్తీక్ తో నా పెళ్లి ఈ ఇయర్ ఎండింగ్ కి ఉంటుంది. ఈ ఇయర్ నా పుట్టినరోజును ఒక వృద్ధాశ్రమంలో సెలెబ్రేట్ చేసుకున్న. అది చాల బెస్ట్ బర్త్ డే. బోర్ మూమెంట్ అనేది నాకు రాదు.

ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంట్లో పని చేస్తా లేదంటే వంట లేదంటే రీల్స్ చూస్తా. బయటికి వెళ్తా. కొత్త రీల్స్ చేయడానికి టాపిక్ వెతుక్కుంటా.. హిడెన్ టాలెంట్ నేను పాటలు కూడా పాడగలను. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఇష్టం, బాలీవుడ్ లో షారుక్ ఖాన్, కోలీవుడ్ లో విష్ణు వర్ధన్ గారు ఇష్టం. ఆయన ఓల్డ్ హీరో. విజయ్ కార్తీక్ కి చెప్పకుండా ఒక పని చేశా..ఒక ఫ్రెండ్ డబ్బులు అవసరం అంటే ఇచ్చా. కానీ ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. క్రికెట్ అంటే ఇష్టం. కాఫీ అంటే ఇష్టం, ఫుడ్ బాగా తింటాను, యాక్షన్ ఫిలిమ్స్ బాగా చూస్తాను. వర్షా కాలం, చలి కాలం అంటే బాగా ఇష్టం. సన్సెట్ అంటే ఇష్టం. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఇక్కడంతా కమర్షియల్ ఫ్రెండ్ షిప్స్ మాత్రమే ఉంటాయి. నాకు కార్తీక్ మాత్రమే అన్నీ." అంటూ చెప్పింది కీర్తి భట్.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.