Read more!

English | Telugu

అసలది డాన్స్ షోనా... జడ్జిమెంట్ ఏంటి ?


బుల్లితెర మీద సైడ్ రోల్స్ చేసే ఆర్టిస్ట్ ఉమాదేవి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ లో లోబోతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఆ ఉమాదేవి పెద్ద కూతురు తనూష "నీతోనే డాన్స్" షో మీద జడ్జెస్ మీద హాట్ కామెంట్స్ చేసింది. ‘నాకు ఒకటి అర్థం కావడం లేదు. నీతోనే డాన్స్ 2.0 అంటే డాన్స్ ఉండాలి. కానీ విశ్వ, నేహా చౌదరి.. ఎప్పుడూ జిమ్నాస్టిక్సే చేస్తారు. ఒకరికి ఒక టాలెంట్ ఉంది అంటే.. యూజ్ చేసుకోవచ్చు కానీ ప్రతిసారి ప్రతి డ్యాన్సులో జిమ్నాస్టిక్స్ చేయడం కరెక్ట్ కాదు.

ఈ జడ్జీలు కూడా అసలెట్లా జడ్జిమెంట్ ఇస్తారో అర్థం కావడం లేదు. పనికి మాలిన జడ్జిమెంట్ . ఏదో జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆర్టిస్టుల్ని పోషించాలి అంతే... కానీ డాన్స్ అంటే ఏంటీ, అసలు జడ్జిమెంట్ ఎట్లా ఇవ్వాలని కూడా తెలియకుండా ఉంటున్నారు’ అంటూ రాసుకొచ్చింది. ‘నీతోనే డ్యాన్స్‌లో స్టార్ మా వాళ్లు కూడా డ్యాన్స్ రాని వాళ్లను సెలక్ట్ చేసుకుంటారు. లిప్ సింక్ ఉండదు. పెయిర్ మధ్య సింకింగ్ ఉండదు. అయినా ఫుల్ మార్క్ ఇచ్చేస్తారు జడ్జిలు. ఈ ఒక్క పెయిర్ అని కాదు.. అన్ని పెయిర్స్ అలానే ఉన్నాయి. మరి వాళ్లు ఏం జడ్జెస్సో నాకు అర్థం కావడం లేదు. అయినా హీరోయిన్లను తీసుకొచ్చి జడ్జిలుగా కూర్చోబెడితే  వాళ్లకేం  తెలుస్తుంది’ అంది. అలాగే మరో కన్నడ పెయిర్ గురించి మాట్లాడుతూ.. "తెలుగు సాంగ్స్ రావు , లిరిక్స్ తెలీవు, ఐనా ఫుల్ మార్క్స్ ఇచ్చేయాలి. ఏదేమైనా కన్నడ వాళ్ళను తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి... అదే మన తెలుగు వాళ్ళు కన్నడ సీరియల్స్ లో, షోస్ లో చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా ? ఆలోచించండి ఒకసారి" అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.