English | Telugu

వెంకటేష్ సర్ నిజంగా గ్రేట్...మెసేజ్ పెట్టగానే రిప్లై ఇచ్చారు

బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సోహైల్ గురించి అందరికీ తెలుసు..హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో మూవీస్ లో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సోహైల్ "బూట్‌కట్ బాలరాజు" అనే మూవీలో నటించాడు .. ఈ మూవీ ఫిబ్రవరి 2 న రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాడు సోహైల్. ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా చాలా జోరుగా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సోహైల్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. "సంక్రాంతి టైంలో నా మూవీ ప్రమోషన్స్ కోసం కొంతమంది సక్సెస్ ఫుల్ యంగ్ హీరోస్ కి ఫోన్ చేసాను. లిఫ్ట్ చేసాక నేను సోహెల్ అనగానే వాళ్ళు ఫోన్స్ కట్ చేసేసారు. తర్వాత అసలు ఫోన్స్ ఎవరూ లిఫ్ట్ కూడా చేయలేదు. నాకు చాలా బాధేసింది.

కానీ వెంకటేష్ సర్ మాత్రం అలా చేయలేదు. నేను ఎప్పుడూ కూడా ఆయన్ని పర్సనల్ గా కలవలేదు కానీ అంత స్థాయి వ్యక్తి ఫోన్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను. ఆయన ఆల్ ది బెస్ట్, బాగా చెయ్యి, కీప్ రాకింగ్ అని చెప్తూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు.. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఎందుకంటే ఎవరి దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియని సిట్యువేషన్ లో ఉన్నాం. నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నాలాంటి యంగ్స్టర్స్ సినిమాలు చేసి మీ సపోర్ట్ అడిగినప్పుడు ఒక్క మాట సాయం చేయండి లేదంటే కనీసం ఒక రిప్లై అన్నా ఇవ్వండి" అని అన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.