English | Telugu

క్రికెటర్‌తో శ్యామల రిలేషన్.. రెస్పాండ్ అయిన‌ యాంకర్!

యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రీసెంట్ గానే ఈమె భర్త నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే శ్యామల మాత్రం తన భర్తను సపోర్ట్ చేశారు. ఆయన అలాంటి వారు కాదని.. మహిళలను మోసం చేసే అవసరం అతడికి లేదంటూ శ్యామల చెప్పుకొచ్చింది. న‌ర‌సింహారెడ్డి ప్ర‌స్తుతం బెయిల్‌పై బ‌య‌ట‌కొచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. బుల్లితెరపై పలు సీరియల్స్, వంటల ప్రోగ్రామ్లతో ఫేమస్ అయిన శ్యామల.. బిగ్ బాస్ షో ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈమె సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లను హోస్ట్ చేస్తూ బిజీ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్యామల.. తన ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు చాట్ చేస్తుంటుంది. తన కుమారుడు ఇషాన్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలాంటి శ్యామల తాజా తనపై వచ్చిన ఓ మీమ్ పై రెస్పాండ్ అయ్యింది.

ఇండియన్ క్రికెట్ ప్లేయర్, ఫాస్ట్ బౌల‌ర్‌ భువనేశ్వర్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. భువనేశ్వర్ కుమార్, యాంకర్ శ్యామలకు దగ్గర పోలికలు ఉంటాయని అందరూ అంటుంటారు. అలా భువనేశ్వర్ కుమార్, శ్యామల.. బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారేమో అంటూ నెట్టింట్లో ఓ మీమ్ హల్చల్ చేసింది. అలా వచ్చిన మీమ్ పై స్పందించిన యాంకర్ శ్యామల.. "మేం బ్రదర్ అండ్ సిస్టర్ అవుతామని నాకే తెలియదు.. వాళ్లకు ఎలా తెలుస్తుందండి?" అంటూ కౌంటర్ వేసింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.