English | Telugu

ఆయన నా ఫేవరేట్..ఎలాంటి సలహా కావాలన్నా ఆమెకే చెప్తా!

సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యాక చాలామంది ఫేమస్ అయ్యారు. బుల్లితెర మీద సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక అమ్మాయి శ్వేతా నాయుడు. వెబ్ సిరీస్ చేస్తూ, డాన్స్ వీడియోస్, ఫోటో షూట్స్ వంటివి చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఫుల్ ఫేమస్ ఐపోయింది.

ఇప్పుడు శ్వేతానాయుడు తన ఇన్స్టాలో "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అనే టాస్క్ ని ఇచ్చింది. నెటిజన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలకు శ్వేతా ఆన్సర్స్ ఇచ్చింది. "రవికృష్ణ అన్న గురించి ఒక్క మాటలో ఎం చెప్తావ్" అని అడిగిన ప్రశ్నకు "అతను చాలా క్యూట్...నా ఫేవరెట్స్ లో ఆయన కూడా ఉన్నారు" అంది. "లాస్య అక్క గురించి మీ అభిప్రాయం" అని అడిగిన ప్రశ్నకు "నాకు ఎలాంటి సజెషన్ కావాలి అన్నా నేను లాస్య అక్కని అడుగుతాను. తను నాకు మంచి కంపెనీ, మంచి ఫ్రెండ్, ప్యూర్ సోల్..ఐ లవ్ హర్" అని చెప్పింది.

ఇక "నీ పప్పీస్ ఎలా ఉన్నాయి" అని అడిగేసరికి "సూపర్ గా ఉన్నాయి" అని రిప్లై ఇచ్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ మహబూబ్ గర్ల్ ఫ్రెండ్ గా సోషల్ మీడియాలో శ్వేతా నాయుడికి ఫుల్ హైప్ ఉంది. ఇక ఈమె నయనీపావనీతో కలిసి ఢీ-14 లో సందడి చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.