English | Telugu

అషురెడ్డికి ముద్దు పెడుతూ రాహుల్ స‌ర్‌ప్రైజింగ్‌ పోస్ట్!

ఈ మధ్యకాలంలో చాలా మంది తమ కంటెంట్ ను ప్రమోట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆ మధ్య పునర్నవి భూపాలం తన కొత్త వెబ్ సిరీస్ కోసం ఎంగేజ్మెంట్, పెళ్లి అనే రేంజ్ లో హడావిడి చేసింది. అయితే ఇదంతా ప్రమోషన్స్ కోసం చేస్తుందని గ్రహించిన నెటిజన్లు పునర్నవిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇలానే ట్రోలింగ్ కి గురవవుతున్నాడు.

అషురెడ్డితో రాహుల్ కి ఉన్న రిలేషన్ గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ప్రేమ, పెళ్లి అంటూ ఎన్ని రూమర్లు వచ్చినా వారు ఖండిస్తూ వచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమని చాలా సార్లు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యవహారంలో ఏదో మార్పొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా రాహుల్.. అషుతో రొమాన్స్ చేస్తోన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. త్వ‌ర‌లో స‌ర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇలా రొమాంటిక్ ఫోటోను షేర్ చేసి సర్‌ప్రైజ్‌ అని చెబితే అందరూ పెళ్లి గురించి అనుకుంటారని, త‌ద్వారా మంచి ప్ర‌మోష‌న్ ల‌భిస్తుంద‌ని రాహుల్ ఊహించి ఉండొచ్చు.

కానీ ఈ స్ట్రాటజీ వర్కవుట్ అవ్వలేదు. ఇదంతా కూడా ఏదో ప్రమోషన్స్ కోసం చేస్తున్నారని ఊహించిన నెటిజన్లు.. ఆ విధంగానే కామెంట్స్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఇలా చేస్తున్నారని.. మీ పబ్లిసిటీ స్టంట్స్ మాకు తెలుసులే అన్నా అంటూ రాహుల్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ పెట్టిన ఈ సర్‌ప్రైజింగ్‌ పోస్ట్ కి అషురెడ్డి స్పందిస్తూ.. 'అవును దానికి సమయం వచ్చేసింది.. అతి త్వరలోనే' అంటూ కామెంట్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.