English | Telugu

"కొడుకు పుడితే నీలా పెంచుతా".. రవికృష్ణపై సావిత్రి ప్రేమ!

బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న తీన్మార్ సావిత్రి, సీరియల్ నటుడు రవికృష్ణల మధ్య ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అయింది. రవిని తన సొంతింట్లో మనిషిలా ట్రీట్ చేస్తుంటుంది సావిత్రి. అతడికి కోవిడ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం దూరంగా ఉండడంతో సావిత్రి తన ఇంటికి తీసుకెళ్లి సేవలు చేసిందని గతంలో ఓ షోలో చెప్పి ఎమోషనల్ అయ్యాడు రవికృష్ణ. సావిత్రి సొంత అక్క కంటే చాలా ఎక్కువ అని.. అమ్మలా చూసుకుంటుందని రవికృష్ణ సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతూ ఉంటాడు.

ఇక ఈరోజు (జూన్ 9) పుట్టినరోజు జరుపుకుంటున్న రవికృష్ణకు సావిత్రి ఎమోషనల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. ''కొడుకు పుడితే నీలా పెంచాలి.. అంత ప్రేమ.. ఒక వేళ పుట్టకపోయినా ఏం కాదు నా కొడుకువి నువ్వు ఉన్నావ్ అన్న నమ్మకం'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన రవి.. ''లవ్యూ అమ్మా'' అంటూ రిప్లై ఇచ్చాడు.

మరోపక్క రవికృష్ణ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నటి నవ్య స్వామి.చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే వీరి రిలేషన్ పై ఈ జంట పెద్దగా స్పందించింది లేదు. ఇదిలా ఉంటే రవికృష్ణ బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రి అతడితో కేక్ కట్ చేయించింది నవ్య. 'నువ్ కోరుకున్న ప్రతీదీ నీకు దక్కాలని.. ఈ ఏడాది మొత్తం నీకు బాగుండాలని కోరుకుంటున్నట్లు' పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.