English | Telugu
తెలుగు మీడియం ఇస్కూల్‌లో సన్నీలియోన్ పాఠాలు!
Updated : Oct 10, 2023
సన్నీ లియోన్ అంటే చాలు ఆమె చేసిన అన్ని మూవీస్, సాంగ్స్ గుర్తురాకుండా ఉండవు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో నటిస్తోంది సన్నీ. టాలీవుడ్ కి 2014లో 'కరెంటు తీగ' మూవీతో ఎంట్రీ ఇచ్చింది సన్నీ. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో సన్నీ లియోన్ టీచర్ గా నటించింది.
వెండితెర పై టీచర్ గా ఎంట్రీ, బుల్లితెరపై కూడా టీచర్ ఎంట్రీ. ఆ తరువాత మంచు విష్ణు ‘జిన్నా’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ సినిమా గరుడ వేగాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెర మెడకు అడుగు పెట్టబోతోంది. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి అలరించిన సన్నీ లియోన్.. ఇప్పుడు తెలుగు బుల్లితెర పై కనిపించి ఎంటర్‌టైన్ చేయబోతుంది. జీ తెలుగులో సన్నీ లియోన్ ఒక రియాలిటీ షో చేస్తోంది.
ఆ షోని సన్నీ హోస్ట్ గా ఉండి నడిపించబోతుంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ అయ్యింది. ఇక ఈ రియాలిటీ షోకి ‘తెలుగు మీడియం ఇస్కూల్ ’ అని టైటిల్ ని పెట్టారు. సన్నీ లియోన్ గతంలో బాలీవుడ్ కి సంబంధించిన కొన్ని షోస్ కి హోస్ట్ గా చేసింది. మన తెలుగులో సన్నీ లియోన్ చేస్తున్న మొదటి టెలివిజన్ షో ఇదే. మరి వచ్చి రాని తెలుగుతో సన్నీ లియోన్.. తెలుగు మీడియం ఇస్కూల్ లో ఏమేం పాఠాలు చెప్తుందో చూడాలి. తెలుగు నేర్పడానికి మాష్టర్ గా మనోని కూడా ఏర్పాటు చేశారు. ఈ షోలో సన్నీ లియోన్ తో పాటు టాలీవుడ్ యాంకర్ రవి కనిపించబోతున్నాడు. ఐతే ఇప్పుడు సన్నీ లియోన్ హిందీలో మూడు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు, మలయాళ, కన్నడలో ఒక్కో సినిమా చేస్తుంది. ఉపేంద్ర UI లో కీ రోల్ లో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.