English | Telugu

వెన్న కాదు వెనిలా ఐస్ క్రీం ఇచ్చి మోసం చేసింది మా అమ్మ

కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. ఇక ఈ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని పండగల్లోకి కృష్ణాష్టమి అంటే ఆ సంబరాలు వేరే లెవెల్ అన్న మాట. స్కూల్స్ లో పిల్లలకు కృష్ణుడి వేషాలు వేయించి కోలాటాలు ఆడిస్తారు. ఇక కాలనీల్లో, వీధుల్లో, మెయిన్ సెంటర్స్ లో ఉట్టి కొట్టే పోటీలు పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఐతే అమ్మలు కృష్ణుడి పాదాలు వేసి నడిపించి చిన్ని కృష్ణుడే స్వయంగా ఇంటికి వచ్చినట్టు భావించి ఆనంద పడుతూ ఉంటారు. ఇక ఇలాంటి సంబరాలు బోల్డు. ఐతే యాంకర్ సుమ ఈ కృష్ణాష్టమి సందర్భంగా స్పెషల్ గా ఒక వీడియో ప్లాన్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో " యువర్ లిటిల్ కృష్ణాస్" పేరుతో పోస్ట్ చేసింది. చాలా మంది తమ పిల్లలకు కృష్ణుడి వేషాలు వేసి ఆ వీడియోస్ ని సుమకి పంపిస్తే ఆ వీడియోస్ లో ఉన్న చిన్ని కృష్ణుల ఎక్స్ప్రెషన్స్ కి తగ్గట్టు తానె డైలాగ్స్ చెప్తూ ఫుల్ ఎంటర్టైన్ చేసింది.

ఇందులో ఒక చిన్ని కృష్ణుడు తన కాలు మీద కాలేసుకునేసరికి పుష్ప డైలాగ్ చెప్పి సుమ అందర్నీ నవ్వించేసింది. అలాగే చాలామంది అమ్మలు ఈ వీడియోలో వెన్న కాకుండా దాని బదులు దూది పెట్టేసరికి ఇదంతా మోసం అంటూ ఏడుపు మొహం పెట్టి నవ్వించింది. అలాగే ఒక కృష్ణుడికి వాళ్ళ అమ్మ వెన్న బదులు వెనిలా ఐస్క్రీమ్ ఇచ్చి మోసం చేసిందని చెప్తుంది. జాబ్ చేయడానికి సైకిల్ ఎక్కి కృష్ణుడు వెళ్తున్నాడని, ఇంకో కృష్ణుడు ఇంట్లో సైకిల్ తో తిరుగుతుంటే బండికి జిపిఎస్ పెట్టుకోలేదా అంటూ ఫన్ చేస్తుంది. స్లో మోషన్ లో నడిచే కృష్ణుడు, నేచర్ కృష్ణుడు, ఫ్లూట్ తో క్రికెట్ ఆడే కృష్ణుడు, వాకింగ్ కృష్ణ ఇలా ఆ చిన్ని కృష్ణులకు వెరైటీ పేర్లు పెట్టి మరీ నవ్వు తెప్పించింది సుమ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.