English | Telugu

మీరు మా పెళ్లి కార్డు చదివారా?

స్మాల్ స్క్రీన్ మీద ఎవర్ గ్రీన్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలో ఎంతో మంది సక్సెస్ అందుకున్న సీనియర్ యాంకర్ సుమకు సాటి ఎవరూ లేరు. ఆమె టీవీ షోస్ కి, మూవీ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక ఈమె తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లది అప్పట్లోనే లవ్ మ్యారేజ్. ఐతే వీళ్ళ లవ్ పేరెంట్స్ ఒప్పుకొని పేరెంట్స్ సుమ ని గదిలో బందించారంటూ ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పింది. సుమ మాత్రం తన మాట మీద నిలబడడం చూసి తన తల్లిదండ్రులు చివరికి వీరికి రాజీవ్ కనకాలతో పెళ్లి చేసారని చెప్పారు. ఇలా వీరి వివాహం 1999 ఫిబ్రవరి 10వ తేదీ ఘనంగా తెలుగు, కేరళ సాంప్రదాయ పద్ధతులలో జరిగింది. వీళ్ళ పెళ్ళై పాతికేళ్లయిన సందర్భంలో సుమ సోషల్ మీడియా వేదికగా తన వెడ్డింగ్ కార్డ్ ను షేర్ చేసుకోవడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

ఇలా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి పత్రికను షేర్ చేయడమే కాకుండా మీరు కార్డు చదివారా ? 1999లోనే సరికొత్త పద్దతిలో మా వెడ్డింగ్ కార్డ్‌ అంటూ సుమ చెప్పడంతో అది ఇంకా పాపులర్ అయింది. ఇక సుమ రాజీవ్ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక కుమారుడు చదువులను పూర్తి చేసుకొని ఈయన కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సుమ కెరీర్ స్టార్టింగ్ లో చాలా మూవీస్ లో ఆఫర్స్ వచ్చిన అటు వైపు ద్రుష్టి పెట్టకుండా కేవలం సీరియల్స్ మీదే ద్యాస పెట్టిందట. ఐతే 1996లో దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ కనకాల హీరోయిన్‌గా కనిపించింది. ఆ తర్వాత పెద్దగా మూవీస్ చేసిందే లేదు. కేవలం సీరియల్స్ , యాంకరింగ్ వైపే తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంది. బుల్లితెర మీద కొన్నేళ్లుగా సుమ కనకాల టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. కొంత కాలం క్రితం జయమ్మ పంచాయతీ అనే మూవీలో నటించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.