English | Telugu

సింగల్ గా ఉంటే అన్ని అడ్వాంటేజెస్ కానీ రెండు మిస్సవుతాం

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హ్యాష్ టాగ్ సింగిల్ మూవీ టీమ్ నుంచి శ్రీవిష్ణు, కేతిక శర్మ, వెన్నెల కిషోర్, ఇవానా వచ్చారు. వీళ్ళతో హంగామా చేసింది సుమ. "సింగల్ గా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి" అని సుమా అడిగేసరికి "అన్ని అడ్వాంటేజెస్ అండి...అప్పుడు రెండు మిస్సవుతాం" అని చెప్పాడు శ్రీవిష్ణు. ఇక ఇవానా కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెపింది. "సింగల్ గా ఉండడం సర్టెన్ పాయింట్ వరకు ఓకే కానీ ఆ తర్వాత పార్టనర్ అవసరం" అని చెప్పింది.

దాంతో వెన్నెల కిషోర్ కౌంటర్ వేసాడు "అంటే ఈ షోని ఎవరో చూస్తున్నారు" అనేసరికి ఇవానా నవ్వుకుంది. "వెన్నెల కిషోర్ గారు ఇంత హ్యాండ్సంగా ఉండడానికి గల కారణం ఏమిటి" అని అడిగింది సుమ. "డైట్ ఫుడ్, వర్కౌట్స్, ప్రతీసారి సంతోషంగా ఉండడం" అని చెప్పాడు శ్రీవిష్ణు. "నేనేమో మాటవరసకు అడిగాను ఇది నిజమైన క్వశ్చన్ కాదు" అని సుమా చెప్పడంతో "నేను మాటవరసకు ఆ ఆన్సర్ చెప్పను" అని రివర్స్ కౌంటర్ వేసాడు శ్రీవిష్ణు. తర్వాత సుమ కార్ డ్రైవింగ్ స్కూల్ లో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వెన్నెల కిషోర్ కి కొన్ని రూల్స్ చెప్పింది "ముందు కీస్ పెట్టాలి" అని వెన్నెల కిషోర్ చెప్పాడు. "ఇప్పుడు కీస్ ఎవరు పెడుతున్నారు మొత్తం బటన్స్ అన్నీ నొక్కేస్తున్నారుగా" అని చెప్పింది సుమ. "మాది పాత కారు" అని చెప్పాడు వెన్నెల కిషోర్. తర్వాత కేతిక శర్మతో సుమా "వెన్నెల కిషోర్ గురించి తెలుగులో చెప్పు" అని అడిగింది. దాంతో కేతిక "వెన్నెల కిషోర్ చాలా మంచి మనిషి" అని డౌట్ తో చెప్పింది. వెంటనే సుమ "వెన్నెలా కిషోర్ మంచి మనిషా కాదా అన్న విషయం మీద కేతికాకి ఒక డౌట్ ఉంది" అంటూ నవ్వేసింది. ఇవానాతో చపాతీలు చేయించింది. వెన్నెలా కిషోర్ తో మాంగో పచ్చడి ప్రొసీజర్ చెప్పించింది సుమా.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.