English | Telugu

సీఎం కంటే ముందు నన్నే పంపిస్తారు...


సుమ అడ్డా షో ఈ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది..ఇక ఈ షోకి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ టీమ్ నుంచి వక్కంతం వంశి, బ్రహ్మాజీ, హైపర్ ఆది, నితిన్ వచ్చారు... ఇక ఇందులో బ్రహ్మాజీ-నితిన్ ఒక టీమ్ గా ఉన్నారు. ఐతే ఫస్ట్ రౌండ్ దోచెయ్ లో వీళ్ళను ఒక ప్రశ్న అడిగింది "పోలీస్ అనగానే మనకు గుర్తొచ్చేదేమిటి" అనే అడగగానే ఆన్సర్స్ చెప్పారు ఇద్దరు.

ఇక తర్వాత బ్రహ్మజీని మళ్ళీ సుమ అడిగింది. "మీకు పోలీసు స్టేషన్ తో ఏమన్నా అనుభవాలు ఉన్నాయా..?" చాల మూవీస్ లో పోలీస్ క్యారెక్టర్స్ వేసాను. ఇక అలా పోలీస్ డ్రెస్ వేయడం వలన బయట పోలీసులు కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎక్కడ సెక్యూరిటీ ఉన్నా కూడా సీఎం కంటే ముందు నన్నే పంపిస్తారు" అనేసరికి షాకయ్యింది సుమ... "మీరు ఆల్మోస్ట్ మనుషులు ఎన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతారో అన్ని చేసేసారు కదా ..డాక్టర్ , లాయర్, పోలీసు.."అని సుమ అనేసరికి "ఇంకా చేయాల్సిన రోల్స్ చాల ఉన్నాయి." అన్నారు బ్రహ్మాజీ. "ఏమిటి మీకు చేయాలనుకున్న మిగిలిపోయిన రోల్స్" అని సుమ అడిగేసరికి " సుమ అడ్డా షోకి యాంకరింగ్ చేయాలి" అంతేనా.."ఇక్కడే ఉన్నారుగా రండి యాంకరింగ్ చేయండి అని సుమ అనేసరికి...ఊరకే ఆ నాలుగు బ్రాండ్స్ నేమ్స్ చదవండి" అన్నాడు హైపర్ ఆది.

"నేను ఈ యాడ్స్ ని ఇలా గుర్తు పెట్టుకుని చదవను..ఎదురుగా వస్తే చెప్తాను" అని బ్రహ్మాజీ అనేసరికి "ప్రాంప్టార్ ఉన్నప్పుడు పిలుస్తాం" అని కౌంటర్ వేసింది సుమ. ఇక బ్రహ్మాజీ సుమ మీద వచ్చిన దగ్గర నుంచి సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. షోలో తినడానికి సుమ ఐస్క్రీమ్ ఇచ్చేసరికి ఇవి స్నాక్స్ భోజనాలెప్పుడు అంటూ రీసెంట్ గా సుమ ఒక ప్రొమోషన్స్ లో జర్నలిస్టులను ఉద్దేశించి అన్న కామెంట్స్ ని ఇక్కడ రిపీట్ చేసి బ్రహ్మాజీ సుమకి తలపోటు తెప్పించారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.