English | Telugu
మా పెళ్లి ఆ దేవుడి చేతుల్లో ఉంది.. బ్రహ్మానందం బయోపిక్ లో చేస్తా
Updated : Jan 15, 2024
బుల్లితెర మీద జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చే కమెడియన్స్ గెటప్ శీను, రాంప్రసాద్, సుడిగాలి సుధీర్. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు చేసే కామెడీకి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆన్ స్క్రీన్ మీద సుధీర్ - రష్మీ పెయిర్ సృష్టించిన ప్రేమ మాయ కూడా అలాగే ఉంది. వాళ్ళు షోస్ నుంచి విడిపోయి వేరేవేరే షోస్ కి వెళ్ళిపోయినా కూడా వీళ్ళ పెయిర్ పేరు లేకుండా ఒక్క స్కిట్ కూడా పూర్తవదు.
ఐతే ఇప్పుడు గెటప్ శీను హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సుధీర్ లగ్గం గురించిన అసలు నిజాన్ని బయట పెట్టించాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా శీను సుధీర్ కి ఫోన్ చేసాడు. "అరేయ్..నీ లగ్గం ఎప్పుడురా.. ? అనేసరికి నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావా.. అందుకే కదా ఇలా అడుగుతున్నావు.. మాములుగా బయట ఉన్నప్పుడు ఇలాంటివి అసలు అడగవు కదా. నీ పెళ్ళెప్పుడు అని నన్ను నువ్వెప్పుడైనా అడిగావా అసలు.. ఐనా ఇప్పుడు నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా...ఇక పెళ్లంటావా మన చేతుల్లో ఏముంది... ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. అలాగే రష్మీ గారినే పెళ్లి చేసుకుంటావా అని అడిగేసరికి అది కూడా మన చేతుల్లో ఉండదు..అన్ని ఆ దేవుడు రాసినట్టే జరుగుతుంది..అని చెప్పాడు సుధీర్. స్క్రీన్ మీద గుడ్ పెయిర్ కానీ..ఆఫ్ స్క్రీన్ మేము మాట్లాడము అని చెప్పాడు గెటప్ శీను.
"ఒకవేళ బయోపిక్ లో ఏదైనా రోల్ చేయాల్సి వస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చేస్తాను.. ఎందుకంటే మేమంతా కామెడీకి సంబంధించిన క్యాటగిరీలో ఉన్నాం కదా. చిరంజీవి బయోపిక్ వస్తే ఆయనలా నటించడానికి రామ్ చరణ్ ఉన్నారు కదా.. నాకు గెటప్ శీను అనే బిరుదు మల్లెమాల వాళ్ళు ఇచ్చింది కాదు ఆడియన్స్ నుంచి వచ్చింది.." అని చెప్పాడు శీను.