Read more!

English | Telugu

శుభశ్రీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌజ్ లో కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఆదివారం రోజు 2.0 మంచి టీఆర్పీని సొంతం చేసుకుంది. అయితే నిన్న జరిగిన 2.0 గ్రాంఢ్ లాంచ్ లో ఎపిసోడ్ మొదట్లోనే శుభశ్రీ ఎలిమినేట్ అయింది‌. మొదటి వారం నుండి ఇప్పటి వరకు అయిదు వారాలు పూర్తికాగా.. కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక నాలుగు వారాల్లో ఎలిమినేషన్ అయ్యారు. ఇప్పుడు తాజాగా శుభశ్రీ ఎలిమినేట్ అయింది.

శుభశ్రీ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకొచ్చాక అందరి గురించి తన అభిప్రాయం పంచుకుంది. టేస్టీ తేజ సరదాగా ఉండేవాడని, జోక్స్ వేసి నవ్వించేవాడని చెప్పింది. శివాజీ నుంచి ఎంతో నేర్చుకున్నానని అంది. గౌతమ్ కృష్ణతో మంచి బాండింగ్ ఉందని, తనని ఫ్లర్ట్ చేసేవాడని.. ఆ రోజు నేను లెటర్ త్యాగం చేసినప్పుడు నాతో మాట్లాడాలని చాలా ట్రై చేశాడు.

నేను మాట్లాడకపోయేసరికి టిష్యూ పేపర్ మీద థాంక్స్ అండ్ సారీ సుబ్బు అని రాశాడని తనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంది. పల్లవి ప్రశాంత్ ని అన్న అని పిలుస్తానని, మంచివాడని, హౌజ్ లో ఫెయిర్ గా ఉంటాడని శుభశ్రీ అంది. ఇక అమర్ దీప్ తో మనోభావాలు దెబ్బతిన్నాయనే సంఘటనని గుర్తుచేసుకుంది శుభశ్రీ. ఇక కిచెన్ లో ప్రియాంక జైన్ తో కలిసి గడిపిన క్షణాలని చెప్పుకొచ్చింది. ఇలా హౌజ్ మేట్స్ తో తనకి ఉన్న బాండింగ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది శుభశ్రీ.

బిగ్ బాస్ హౌజ్ లో శుభశ్రీ రెమ్యునరేషన్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది. తనకి వారానికి 2 లక్షల చొప్పున అయిదు వారాలకి 10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని నెట్టింట ప్రచారం జరుగుతుంది. అయితే శుభశ్రీ కి రెమ్యునరేషన్ అయిదు వారాల్లో ఇంతనా అని పలువురు భావిస్తుండగా, మరికొన్ని రోజులు తను హౌజ్ లో ఉంటే బాగుండేదని మరికొందరు భావిస్తున్నారు. అయితే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం తను ఎలిమినేషన్ అయిందని తెలిసిన విషయమే.