Read more!

English | Telugu

ఫుకెట్ థాయ్‌లాండ్ స్ట్రీట్ షాపింగ్ పేరుతో శ్రీముఖి కొత్త వ్లాగ్!

శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవిరంగంలోనే కాకుండా సినిమాలల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాలల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి.

జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ తో గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది. 

ఇటు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. అయితే థాయ్ లాండ్ లో సమ్మర్ వెకేషన్ అంటూ తాజాగా రిలీజ్ చేసిన ఒక వీడియోలో తను ఒక అబ్బాయితో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనిని పెళ్ళి చేసుకోవడానికే బ్యాంకాక్ వెళ్ళిందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.

అయితే శ్రీముఖి తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి థాయ్ లాండ్ వెళ్ళింది. అక్కడ ఒక హోటల్ రూం తీసుకొని తన జర్నీ అంతా బ్కాంకాంక్ డే-1 పేరిట వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వ్యూస్ వచ్చాయి. కాగా తాజాగా 'ఫుకెట్ థాయ్‌లాండ్ స్ట్రీట్ షాపింగ్' టైటిల్ తో మరో వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. అక్కడ టైగర్ కింగ్ డమ్ లోకి వెళ్ళిన శ్రీముఖి, టైగర్ ని చూసి భయపడింది.

ఆ తర్వాత బయటకు వచ్చి ఒక షాప్ ని చూపించింది. అ తర్వాత బయట ఒక షాప్ లో వంకాయలు చూసిందంట శ్రీముఖి.. అవి వంకాయలేనా అని అతడిని అడుగగా సిగ్గుపడ్డాడంట. అయితే మళ్ళీ ఆ షాప్ కి వెళ్ళి చూసి.. ఓ దిజ్ ఈజ్ వంకాయల్స్ అని పాష్ గా మాట్లాడింది. అయితే తనని అడుక్కునేదానిలాగా షాప్ వాడు భావించాడా అని తన మీద తనే జాలి చూపించుకుంది శ్రీముఖి. అయితే ఈ వ్లాగ్ చివరలో తన బర్త్ డే రోజున విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికి స్పెషల్ గా థాంక్స్ చెప్పింది. అలాగే తనని సపోర్ట్ చేస్తున్న ప్రతీఒక్కరికి లవ్ యూ చెప్పేసింది శ్రీముఖి. ఇలా త‌న బ్యాకాంక్ టూర్ ని ఎంజాయ్ చేస్తుంది శ్రీముఖి. తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి మంచి వీక్షకాధరణ లభిస్తుంది.