English | Telugu
శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫన్నీ wwf ఫైటింగ్ పోటీలు
Updated : Sep 10, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు wwf తరహాలో ఒక ఫన్నీ ఫైటింగ్ తో వచ్చేసారు కమెడియన్స్ . "భార్యలు పారిపోయారని ఏడుస్తున్న భర్తలు, భర్తలను వదిలించుకుని పారిపోయే వచ్చిన భార్యలు" అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు ఈ వారం. భర్త wwf లో కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ భార్యలు మాత్రం హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. wwf లో వేసుకునే చెడ్డీలతో, బెల్టులతో వచ్చి ఫన్నీ రెజ్లింగ్ పోటీలు పెట్టుకుంటారు.ఇల్లీగల్ అఫైర్స్ కాండిడేట్స్ అంటూ పంచ్ ప్రసాద్ వాళ్ళందరి గురించి ఇంట్రడక్క్షన్ ఇస్తాడు.
తర్వాత రింగ్ లోకి వెళ్లిన ఆది, సన్నీ రెజ్లింగ్ చేసుకుంటూ మధ్యలో సన్నీ ఆదికి హెడ్ మసాజ్ బాడీ మసాజ్ చేస్తుంటాడు. ఆ సీన్ చూసేసరికి ఆ షోకి వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు పడీ పడీ నవ్వుతారు. తర్వాత ఒక స్కూల్ నుంచి ఒక చిన్నారి వచ్చి నాటీ నరేష్ తో మ్యాజిక్ చేస్తుంది. ఆ మేజిక్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత ఆటో రాంప్రసాద్ సరిగా రెజ్లింగ్ చేయకపోయేసరికి నువ్వు చేతబడి చేస్తున్నావా ఫైట్ చేస్తున్నావా అంటూ ఫన్ క్రియేట్ చేసాడు.