English | Telugu

నాకు ఊపిరి ఉన్నన్నాళ్ళు వాడు బాగుండాలి..విశ్వ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ


శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఎపిసోడ్ కొత్తగా ఫాదర్స్ డే స్పెషల్ గా "డియర్ డాడీ" పేరుతో రాబోతోంది. ఈ షోకి గెస్ట్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వచ్చాడు. ఇక పిల్లలంతా వచ్చి సమ్మర్ హాలిడేస్ ఐపోతున్నాయిగా ఫాథర్స్ ని కూల్ చేయాలంటే ఫాదర్స్ డే చేద్దాం అంటూ ఆడిపాడారు పిల్లలంతా. ఇందులో అంజలి పవన్ వాళ్ళ పాప చందమామ అలాగే విశ్వ వాళ్ళ అబ్బాయి ర్యాన్ ఇద్దరూ డ్రాయింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. అందులో చందమామ పెయింట్స్ సరిగా వేయకపోయేసరికి ర్యాన్ ఐతే "చందమామ నువ్వు విన్ ఐతే నేను కూడా విన్ ఐనట్టే..మేమిద్దరం విన్నర్స్" అంటూ రష్మీకి చాలా క్లియర్ గా చెప్పాడు. ఇక తర్వాత రాఘవ వాళ్ళ అబ్బాయి డంబెల్స్ పట్టుకుని వచ్చాడు. "ఇక్కడున్న ఫాదర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఫస్ట్" అన్నాడు. "మీరేమన్నా నేషనల్ ఫాదర్సా లేదంటే చర్చ్ ఫాదర్సా రెస్పెక్ట్ ఇవ్వడానికి" అన్నాడు అంతే రాఘవ షాకయ్యాడు. ఇక తర్వాత "నాన్నెందుకో వెనకబడ్డాడు" అంటూ ఒక స్కిట్ ని ప్లే చేశారు. అందులో విశ్వ ఒక ముసలాయన గెటప్ లో వచ్చి తండ్రి పడే కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దాంతో ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్ లో "నాకు ఊపిరి ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుండాలి... వాడు నాతోనే ఉండాలి" అంటూ తన కుమారుడు ర్యాన్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి అలా కన్నీళ్లు పెట్టుకొనేసరికి ర్యాన్ కూడా వచ్చి విశ్వ కన్నీళ్లు తుడిచాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.