English | Telugu

అమ్మానాన్నల రాకతో శ్రీసత్య కంటతడి.. ఎమోషనల్ అయిన హౌస్‌మేట్స్!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ సూపర్ ఎమోషనల్ గా సాగింది. మొదట ఫైమా వాళ్ళ అమ్మ రాగా, ఆ తర్వాత శ్రీసత్య వాళ్ళ అమ్మ, నాన్నలు వచ్చారు.మొదటగా హౌస్ లో సోను.. సోను.. అనే పిలుపు వినిపించింది. హౌస్ మేట్స్ అందరు ఎవరోనని ఆశ్చర్యపడ్డారు. "సోను అంటే మా అమ్మ వచ్చినట్టుంది" అని శ్రీసత్య ఎమోషనల్ గా మెయిన్ గేట్ దగ్గరకు పరుగున వచ్చేసింది. ఆ తర్వాత శ్రీసత్య వాళ్ళ అమ్మ, నాన్నవచ్చారు. హౌస్ లో వాళ్ళని చూడగానే శ్రీసత్య ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. హౌస్ మేట్స్ అందరు ఎమోషనల్ అయ్యారు.

"మీ పేర్లు అన్ని తెలుసు.. మీరు అందరూ గేమ్ బాగా ఆడుతున్నారు" అని శ్రీసత్య వాళ్ళ నాన్న అన్నాడు. ఆ తర్వాత అమ్మకి, శ్రీసత్య అన్నం తినిపించింది. "బయట అంతా బాగుందా? నేను గేమ్ ఆడుతున్నానా?" అని శ్రీసత్య అడిగింది. "కొంచెం మార్చుకోవాలి. వెటకారం తగ్గించుకో.. అంతకముందు పొలైట్ గా ఉండేదానివి. ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యావ్?" అని నాన్న అడిగాడు.

"నా కూతురు, ఇంత ఎత్తుకు ఎదుగుతుంది అని అనుకోలేదు." అని ఆయన అన్నాడు. "ఇంకా చాలా ఉంది" అని శ్రీసత్య అంది. "ఇంకా చాలా ఉంది. దాచాం.. కుప్పలు కప్పలుగా ఉంది" అని శ్రీహాన్ అనగా, "ఏకాభిప్రాయమేగా" అని నాన్న అన్నాడు. దీంతో కాసేపు అందరు నవ్వుకున్నారు.

శ్రీసత్యతో "నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్ వేస్తున్నావ్" అని నాన్న అన్నాడు. "ఒక్కసారే అలా చేసాను" అని సత్య చెప్పగా, "ఒక్కసారి చేసినా వంద సార్లు చేసినా తప్పు తప్పే.. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి" అని నాన్న అన్నాడు. ఆ తర్వాత కొన్ని సలహాలు చెప్పాడు. బిగ్ బాస్ టైం అయిందని చెప్పగానే అమ్మ, నాన్నలు బై చెప్పేసి వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే, శ్రీసత్య ఏడుస్తూ ఉండిపోయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.