English | Telugu

 ఢీ ఫైనల్స్ ని సీట్ బెల్ట్ పెట్టుకుని చూడండి!

ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ఫైనల్ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇదొక గూస్ బంప్స్ ప్రోమో. ప్రోమోనే ఇలా ఉంది అంటే షో ఇంకెలా ఉండబోతోందో అంచనా చేయొచ్చు. హోస్ట్ ప్రదీప్ కూడా అదే విషయాన్ని చెప్పాడు. "ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, టీవీ ముందు కూర్చుని చూస్తున్న వాళ్లైనా సీట్ బెల్ట్ ఉంటే అది కూడా పెట్టుకుని ఈ షో చూడండి ఎందుకంటే అద్భుతమైన డాన్సర్స్ మధ్యన పోటీ జరగబోతోంది.

ఈ స్టేజి గ్యారెంటీగా షేక్ అవబోతోంది. లెట్స్ బిగిన్ షూటౌట్" అని చెప్పాడు. ఇక ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా శ్రీలీలే ఎంట్రీ ఇచ్చింది. "ఈ స్టేజికి మీరు వచ్చాక కళొచ్చింది...మీకు డాన్స్ కి ఎంత దగ్గర సంబంధం ఉంది" అని ప్రదీప్ అడిగాడు "నాకు మూడేళ్ళ వయసున్నప్పుడు నాకు సరిగా నడవడం కూడా వచ్చో లేదో తెలీదు కానీ మా అమ్మ మాత్రం డాన్స్ క్లాస్ కి పంపించేది..అప్పుడు నేను డాన్స్ క్లాస్ నుంచి కాళ్ళకు ఇంతింత బొబ్బలతో వచ్చేదాన్ని ఇంటికి ..

నేను అప్పుడు తిట్టుకునేదాన్ని...ఇది నాకు టార్చర్ అమ్మా...దీని బదులు నేను స్కూల్ కి వెళ్ళిపోతాను అమ్మా..తొందరగా జాయిన్ ఐపోతా అమ్మా" అని ఏడ్చేదాన్ని. తర్వాత కమెడియన్ ఆది వచ్చేసరికి సేమ్ శ్రీలీలను అడిగినట్టే "డాన్స్ కి మీకు ఏమిటి సర్ సంబంధం" అని ప్రదీప్ అడిగేసరికి శ్రీలీలే చెప్పిందే ఆది చెప్పి కాసేపు నవ్వు తెప్పించాడు. ఈ వారం ఢీ గ్రాండ్ ఫినాలేలో గ్రీష్మ, పండు, సోమేష్ మాస్టర్లు తమ కంటెస్టెంట్స్ తో అద్దిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేయించారు. ఇంతకు ఈ సీజన్ 15 టైటిల్ విన్నర్ ఎవరు కాబోతున్నారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.