English | Telugu

పెళ్ళికి ముందే హన్సిక పేరుని టాటూగా వేసుకున్న సోహెల్!


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రతీ శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవుతున్న 'హన్సిక లవ్ షాదీ డ్రామా' సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ‌గతవారం విడుదలైన ఎపిసోడ్‌లో హన్సిక తన పెళ్ళి గోల్ఫ్ గ్రౌండ్ లో జరగాలని కోరగా అలాగే జరుగుతుందని ఈవెంట్ మేనేజర్ చెప్పాడు. అయితే తాజాగా విడుదలైన మూడవ ఎపిసోడ్‌లో ట్విస్ట్ లు ఆకట్టుకుంటున్నాయి.

హన్సిక తమ్ముడు ప్రశాంత్ గురించి చెప్పాలంటే.. తను నాకు మంచి ఫ్రెండ్‌.. వాళ్ళ అక్క కోసం నేను ఏదైనా స్పెషల్ గా చేస్తానని చెప్పినప్పుడు తను సరేనన్నాడు. నేను టాటూ వేసుకుంటానంటే తనే 'టాటూ వేసుకుంటానంటే వద్దన్నాడు. నువ్వు ప్రేమిస్తే ఈ టాటు వేసుకుంటావా అని నన్ను డిస్కరేజ్ చేసాడు ప్రశాంత్. కానీ నేను ఎక్కడా కూడా డ్రాప్ అవ్వలేదు. హన్సిక పేరుని హిందీలో టాటూ వేసుకున్నాని చెప్పుకొచ్చాడు సొహెల్.

హన్సిక వాళ్ళ అమ్మ మధ్య ఉన్న బాండింగ్ గురించి‌ చెప్పుకొచ్చింది. వాళ్ళ అమ్మ తనని కన్యదానం చెయ్యనని చెప్పింది. నా కూతురేం వస్తువు కాదని.. కావాలంటే ఆవులను దానం చేస్తాను.. కాని కన్యాదానం చెయ్యనని చెప్పింది.. నువ్వు పెళ్ళికి ముందు ఎలా ఉన్నావో, పెళ్ళి తర్వాత కూడా అలాగే ఉండొచ్చని హన్సిక అమ్మ చెప్తూ ఏడ్వగా.. దీంతో హన్సిక కూడా ఎమోషనల్ అయి ఏడ్చేసింది. "అమ్మా నువ్వు స్ట్రాంగ్.. నువ్వు ఇలా ఏడిస్తే నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను" అని హన్సిక చెప్పి ఓదార్చింది. ఆ తర్వాత సొహెల్, హన్సిక కలిసి వాళ్ళ పెళ్ళిబట్టలు ఎలా ఉండాలో డ్రెస్ డిజైన్ చేసిన షాప్ కి వెళ్ళి చూసుకొని ఇద్దరూ తమ డ్రెస్ లు ఎలా ఉన్నాయోనని సరిచూసుకుంటారు. దాని తర్వాత సొహెల్, హన్సిక ఫ్యామిలీ కలిసి పంజాబీ స్టైల్ లో అమ్మవారికి పూజ చేసి..‌ ఆ పూజలో యాభై రకాల స్వీట్స్ పెట్టారు. ఆ స్వీట్స్ ని తమ బంధువులకు పంచారు. ఇలా వారిద్దరూ ‌కలిసి పెళ్ళికి రెడీ అయ్యారు. ఆ తర్వాత రాబోయే నాలుగవ ఎపిసోడ్ ప్రోమోని ఈ ఎపిసోడ్ చివరన ఆడ్ చేసారు. ఆ ప్రోమో ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.