English | Telugu

సిరి దృష్టిలో టాప్-5 వాళ్ళేనట!

బిగ్ బాస్ ఉల్టా పల్టాతో ఈ సీజన్ సరికొత్తగా మొదలైంది. సక్సెస్ ఫుల్ గా పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం రన్ అవుతుంది. కామన్ మ్యాన్ దగ్గర నుండి సెలబ్రిటీలు సైతం బిగ్ బాస్ ని చూస్తుంటారు. మొన్న మూవీ ప్రమోషన్స్ కి వచ్చిన హీరో శ్రీకాంత్ బిగ్ బాస్ ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవలేదని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని బట్టే తెలుస్తుంది బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో. ఈ సీజన్ మరికొన్ని వారాల్లో పూర్తి కానుంది. దీంతో ఎవరి గేమ్ ఎలా ఉందో? ఎవరి బిహేవియర్ ఎలా ఉందోనని ఒక అంచనాకి వచ్చి ప్రతీవారం నామినేషన్ లో ఉన్న తమ కంటెస్టెంట్ కీ ఓటు వేసి సేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పది మంది ఉండగా గత వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పడంతో అశ్విని, గౌతమ్ ఇద్దరు సేవ్ అయ్యారు.

భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సీజన్‌‌.. అంచనాలకు తగ్గట్టు కంటెస్టెంట్స్ బాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. గత వారం ఫ్యామిలీ వీక్ లో ప్రతీ కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ వచ్చి వారి అభిప్రాయాలని చెప్తూ.. టాప్-5 లో ఎవరుంటారనేది పెట్టడం జరిగింది. అందులో కామన్ గా శివాజీ, ప్రశాంత్, యావర్ ఉండడం జరిగింది. ఇలా ఒక్కొక్కరి అభిప్రాయంలో తమ టాప్-5 ని సెలెక్ట్ చేయడంతో హౌస్ లోని వారందరికి ఒక ఐడియా వచ్చేసింది.

అసలు విషయనికొస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారి గురించి ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ.. ఇలా ఎవరికి వారే తమ సపోర్ట్ ని ఇస్తున్నారు. సిరి హనుమంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ లో కొన్ని విషయాలని షేర్ చేసుకుంది. మీ దృష్టిలో బిగ్ బాస్ హౌస్ లోని వారిలో టాప్-5 ఎవరని తన అభిమానులు అడుగగా.. నాకు అమర్, అర్జున్ టాప్ 5 లో ఉండాలని ఉంది. ఉండాలి కూడా గేమ్ బాగా ఆడుతున్నారు. ఇంక శివాజీ, ప్రశాంత్ టాప్-5 లో ఉంటారు. శోభాశెట్టి, యావర్ ఈక్వల్ గా ఆడుతున్నారు. శోభాశెట్టికి నెగెటివిటి ఎక్కువగా ఉంది. శివాజీ, ప్రశాంత్, యావర్ లు టాప్-5 ఉంటారు. అమర్ దీప్, శోభాశెట్టి కూడా ఉండాలని కోరుకుంటున్నానంటూ సిరి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.