English | Telugu

పెద్దోడు ఓడిపోయాడు.. చిన్నోడు గెలిచాడు... శివాజీ హ్యాపీ!

గత వారం ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన గేమ్స్‌లో విజయం సాధించి ఎవిక్షన్ పాస్ ని తన సొంతం చేసుకున్నాడు యావర్. అయితే శనివారం రోజు వచ్చిన నాగార్జున యావర్‌కు కంగ్రాట్స్ చెబుతూనే... నువ్వు ఆడిన గేమ్స్‌ని ఒక్కసారి చూద్దామా అంటూ యావర్ ఆడిన గేమ్స్‌ని చూపించాడు. ఆ వీడియోలో బిగ్ బాస్ చెప్పిన గేమ్ రూల్స్‌ను యావర్ పాటించకుండానే గేమ్ విన్నర్‌గా నిలిచాడనే విషయం తెలిసిపోయింది. యావర్ తను చేసిన ఫౌల్ గేమ్‌ని చూసి తనకొచ్చిన ఎవిక్షన్ పాస్ ని నిజాయితీగా తిరిగి బిగ్ బాస్‌కి అప్పగించాడు. ఈ రోజు ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన రేస్ లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. కాగా శివాజీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

బిగ్ బాస్ సీజన్-7 లో పన్నెండవ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఒకే ఒక్క టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌. ఇందులో ఎవరైతే గెలుస్తారో వారిదే ఎవిక్షన్ పాస్ అని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ తమ సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

నిన్నంతా నామినేషన్ ల హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ టార్గెట్ చేసి మాటలు జాగ్రత్తగా రానీయి అనడం.. నేనేంటో చూపిస్తానని చెప్పడం. అమర్ దీప్, రతికల మధ్య మాటల యుద్ధం అంతా హైలైట్ అవ్వగా.. నేడు విడుదల చేసిన మొదటి ప్రోమోలో ప్రియంక వర్సెస్ శివాజీ హీటెడ్ ఆర్గుమెంట్ సాగినట్టుగా తెలిసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన రెండో ప్రోమోలో యావర్-అంబటి అర్జున్, గౌతమ్-ప్రశాంత్ ల మధ్య కొన్ని సంభాషణలు చూపించాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్.. " మీకు ఇదే చివరి అవకాశం.. ఎవిక్షన్ పాస్ పొందడానికి ఒకే ఒక్క టాస్క్ ఇస్తున్నాను. ఇందులో గెలిచిన వారిదే ఎవిక్షన్ పాస్ " అని చెప్పాడు.

ఒక టేబుల్ స్టాండ్ మీద మొదట ప్లేట్, తర్వాత కప్పు, సాసర్ అంటూ ఒక్కొక్కటిగా పేర్చాలి.. ఇక వాటిని కింద పడకుండా ఎంత ఎక్కువ సేపు ఉంటారో వారే విజేత అని కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ చెప్పగా.. మొదట శోభాశెట్టి అవుట్ అయింది. ఆ తర్వాత అశ్వినిశ్రీ, రతిక, అంబటి అర్జున్, శివాజీ, యావర్, గౌతమ్ అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. చివరగా ప్రియాంక, ప్రశాంత్ రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ టాస్క్ పూర్తయిందని, పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచాడని నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎవరికి దక్కిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.