English | Telugu
నా పుట్టింటికి ఇక సెలవు.. ఎమోషనల్ ఐన శ్రద్ధా
Updated : Aug 13, 2023
ముంబైలోని తన పుట్టింటి నుంచి హైదరాబాద్ లోని అత్తింటికి బయల్దేరి వెళ్ళింది విశ్వా అండ్ ఫామిలీ. సెకండ్ డెలివరీ కోసం శ్రద్దా తన పుట్టింటికి వచ్చి నాలుగు నెలలైపోయింది. ఇక ఇప్పుడు పిల్లాడికి రెండు నెలలు వచ్చేసరికి తన పుట్టింటికి వెళ్ళడానికి అందరి లగేజెస్ ని సర్దేసింది. హైదరాబాద్ నుంచి ముంబైకి తన భర్త విశ్వాని వదిలి పెట్టి వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యింది. ఇక ఇప్పుడు తన అమ్మానాన్నను వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంది శ్రద్దా. ఇక పెద్ద కొడుకు ర్యాన్ కూడా స్కూల్ కి వెళ్లడం మానేసాడు. దాంతో టీచర్స్ శ్రద్దాకి వాట్సాప్ లో నోట్స్ పెట్టడం వంటివి చేసేసరికి ఇంట్లోనే వర్క్ చేయించిందట శ్రద్దా. ఇక ఫస్ట్ టైం కంప్లీట్ ఫామిలీ ఫ్లయిట్లో వెళ్తున్నట్టు చెప్పాడు విశ్వా. అలాగే ఫామిలీని వదిలి వెళ్ళేటప్పుడు ఆ బాండింగ్ ని అలాగే ఫ్లయిట్ లో వెళ్ళేటప్పుడు మూమెంట్స్ ని అన్ని కాప్చర్ చేస్తాను అని చెప్పాడు.
ఇక శ్రద్దా తన తల్లిని వదిలి వెళ్ళేటప్పుడు తనను బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు తుడుస్తూ శ్రద్దా వాళ్ళ అమ్మ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇక శ్రద్దా తన తల్లి కాళ్లకు దణ్ణం పెడదామనుకుంది కానీ పెట్టనివ్వలేదు. అమ్మా, నాన్న కాళ్ళు స్వర్గానికి ద్వారాలు అంటారు...పర్లేదు మీ కాళ్ళకు దణ్ణం పెట్టుకోనివ్వండి అని శ్రద్దా చెప్పగా.. నో అని చెప్పేసింది శ్రద్దా వాళ్ళ అమ్మ. తర్వాత వాళ్ళ నాన్నను హగ్ చేసుకుని ఏడ్చేసింది శ్రద్దా. అలా చివరికి ఫామిలీతో పాటు చుట్టాలు, ఫ్రెండ్స్ అంతా వచ్చి ఎయిర్ పోర్ట్ లో దింపారు శ్రద్దగా ఫామిలీని. అలా శ్రద్దా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసింది. ఇక ఈమె తన ఛానల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.