Read more!

English | Telugu

ఫస్ట్ టైం మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనుక్కున్న మోనిత

సోషల్ మీడియా హవా పెరిగాక కూరగాయలు కొనడం, బేరం చేయడం కూడా ఒక పెద్ద సబ్జెక్టు ఐపోయింది. మరి అంత పెద్ద సబ్జెక్టుని నేర్చుకోవడానికి బయల్దేరింది అమ్మడు మోనిత అదేనండి శోభా శెట్టి. కార్తీక దీపం ఐపోయినా మోనిత పేరే వస్తోంది కానీ అసలు పేరు ఎవరికీ గుర్తు రావడం లేదు. మరి సీరియల్ కి శుభం కార్డు పడ్డాక వంటలక్క వాళ్ళ ఊళ్ళో ఛిల్ల్ అవుతుంటే డాక్టర్ బాబు ఈవెంట్స్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటే మన మోనిత మేడం మాత్రం ఫస్ట్ టైం కూరగాయలు కొనడానికి వెళ్ళింది. వెయ్యి రూపాయలకు ఎన్ని కూరగాయలు వస్తాయో కూడా తెలియదని చెప్తూ మూతికి మాస్క్ వేసుకుని కూరగాయలు అన్నీ కొనేశాక మాస్క్ తీసి వాళ్ళను సర్ప్రైజ్ చేస్తానని చెప్పింది.

అలాగే కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు కొన్నది. కూరగాయలు, బిర్యాని మసాలా ప్యాకెట్లు, హెయిర్ క్లిప్స్, బాగ్ , చీర కొనుక్కుంది...8 నిమ్మకాయలు 20 రూపాయలకు తీసుకుని షాకయ్యింది..ఇంట్లో కూర్చుని సూపర్ మార్కెట్ కి ఆర్డర్ పెట్టుకుంటే ఒక్కో నిమ్మకాయ 25 రూపాయలు పడుతుంది ఇలా వచ్చి కూరగాయలు కొనుక్కోవడం మంచి ఎక్స్పీరియన్స్ అని ఫీల్ అయింది. మధ్యలో కొంతమంది ఫాన్స్ కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే పాప్కార్న్ కొనుక్కుంది..మార్కెట్ లో  ఒక కూరలమ్మి గుర్తుపట్టి పిలిచి సీరియల్ బాగుందని చెప్పింది...ఆమె దగ్గర కూడా కూరలు కొనుక్కుంది మోనిత. ఇక ప్రతీ  ఆదివారం  ఇలా మార్కెట్ కి వెళ్లి కూరలు కొనుక్కుంటాను  అని చెప్పింది.