English | Telugu

మా నాన్న అలాంటోడు...అమ్మ చనిపోదామనుకుంది

"లవ్ యు అమ్మ" ఎపిసోడ్ ఒక రేంజ్ లో అలరించింది అలాగే కన్నీళ్లు కూడా పెట్టించింది. ఇందులో మదర్స్ చాలామంది తమ తమ జీవితాల్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి టైం ఎప్పుడూ సైలెంట్ గా ఉండే బుల్లితెర నటుడు శివ కుమార్ తన లైఫ్ లో జరిగిన ఒక దారుణమైన ఇన్సిడెంట్ ని అందరి ముందు చెప్పాడు. చెప్పకూడదు అనుకుంటూనే చెప్పానన్నాడు. "సినిమాల్లో తాగొచ్చి మొగుడు పెళ్ళాన్ని కొట్టడం చూస్తూ ఉంటాం కదా. రియల్ లైఫ్ లో కూడా అలాంటివి జరుగుతూనే ఉంటాయి.

మా ఇంట్లో కూడా జరిగింది. మా నాన్నకు పెళ్ళికి ముందు నుంచి మందు తాగే అలవాటు అలాగే తంబాకు నమిలే అలవాటు ఉండేది..ఎప్పుడూ ఇంటికొచ్చి మా అమ్మను కొట్టేవాళ్ళు. నేను అది చూసేవాడిని. నా ఫ్రెండ్స్ అందరి ఫాథర్స్ పిల్లల కోసం కష్టపడుతూ ఉంటే మా ఇంట్లో అంతా రివర్స్ లో ఉండేది. ఆ టైంలో అమ్మకి టీచర్ జాబ్ వచ్చింది. ఒక మారుమూల పల్లెటూరులో పోస్టింగ్ వేశారు. మా నాన్న పనికి వెళ్తే ఐదారు రోజులు ఇంటికి రారు. నన్ను నా చెల్లిని చూసుకునే వాళ్ళే ఎవరూ లేరు. మా అమ్మ తనతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్లేది. స్కూల్ లో మమ్మల్ని కూర్చోబెట్టి తన క్లాసెస్ కి వెళ్ళేది. నేనప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నా. మా నాన్న వచ్చి జస్ట్ 20 రూపాయల కోసం గొడవపెట్టుకుని కొట్టాడు. నేను ఏడుస్తున్నా. అప్పుడు అక్కడికి పల్లెటూరి వాళ్లంతా వచ్చేసారు. అప్పుడు ఆ బాధలు భరించలేక నాకు ఈ జీవితం వద్దు అంటూ మా అమ్మ అగ్గిపెట్టె తీసుకుని కాల్చేసుకోవడానికి రెడీ ఐపోయింది. సరిగా అప్పుడే వాళ్ళ స్టూడెంట్ వచ్చి ఆ అగ్గిపెట్టె తీసుకుని బయటకి వెళ్ళిపోయింది. కాబట్టే మా అమ్మ నేను, నా చెల్లి ఇక్కడ బతికి ఉన్నాం.

ఫామిలీ చూసుకునేవాడు మగాడు అంటారు. నా రియల్ లైఫ్ మగాడు మా అమ్మ. నేను ఎప్పుడూ కూల్ డ్రింక్ కూడా తాగాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు మా నాన్నను చూసి ఉన్నాను కదా అందుకే. తాగే అలవాటు వద్దు..ఫామిలీని మంచిగా చూసుకోండి. రేపు నా కొడుకు పుడితే వాడికి నేను ఇన్స్పిరేషన్ గా ఉండాలి.. నా కొడుకు నన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి." అంతే అని చెప్పాడు.. శివ గురించి అతని సైలెన్స్ వెనక ఉన్న బాధ గురించి ఈరోజు మాకు తెలిసింది అని చెప్పింది శ్రీముఖి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.